పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



6. సంఖ్యాకాండం

బైబులు భాష్యం - 145

విషయసూచిక

1. టబేరావద్ద నిషురాలు 104.
2. కిబ్రోతు హట్టావా వద్ద నిషురాలు 105
3. మిర్యాము అహరోనుల అసూయ O6 

4. వేగు చూడబోయినవారి కథ 107 5. కోరా, దాతాను అబీరాముల తిరుగుబాటు 108

6. మోషే అవిశ్వాసం 110
7. కంచు సర్పం 11
8. బిలాము కథ 111

9. బాలు పెయోరు సంఘటనం 14

10. మోషేకు అనుయాయి యోషువా 15

11. సంఖ్యాకాండం, క్రైస్తవులు 115

1. టబెరా వద్ద నిషురాలు 11,1-3

యిస్రాయేలు ప్రజలు మోషే నాయకత్వాన సీనాయినుండి కదలి ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు టబేరా వద్ద మోషేమీద తిరగబడ్డారు. మోషేను ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్లే. కనుక దేవుడు అగ్నిని పంపి ప్రజలను కాల్చివేసాడు. ఆ శిక్షకు తట్టుకోలేక ప్రజలు మోషేను దేవునికి విన్నపం చేయమని బతిమాలారు. అతని వేడుదలపై దేవుడు అగ్నిని ఆపివేసాడు. ఈ తావుకి టబేరా అని పేరు. ఈ పేరుకి మండడం అని అర్థం. అనగా ఇక్కడ దేవుని అగ్ని యిప్రాయేలీయులపై మండి వారిని శిక్షించింది. బైబులు చాల తావుల్లో స్థలనామాలను పేర్కొని, ఆ నామం ఏలా వచ్చిందో కథగా చెప్తుంది. ఈ కధ అలా స్థలనామాలను పేర్కొనేది.

ఇది తిరుగుబాటు కథ. ఈ గ్రంథంలో ఈలాంటి తిరుగుబాట్లు చాల వస్తాయి. మామూలుగా వీటిల్లో 5 అంశాలు వుంటాయి. 1. ప్రజలు దేవునిపై తిరగబడతారు. 2. దేవుడు వారిని శిక్షిస్తాడు. 3. ప్రజలు ఆ శిక్షను భరించలేక మోషేకు విన్నపం చేస్తారు. 4. అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. 5. శిక్ష తొలగిపోతుంది.

దేవునికి ఎదురుతిరగడం పాపం. ఆలాంటి పాపానికి మనం పాల్పడకూడదు.