పుట:Bharatiyanagarik018597mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

10. సుమత్రా ద్వీపము.

సుమత్రా ప్రశంస.

హిందూవాఙ్మయమునం దనేక స్థలముల సుమత్రాద్వీపప్రశంస గలదు. శ్రీమద్రామాయణమున సీతాన్వేషణార్థము వానరులనంపుచు సుగ్రీవుడు తూర్పుదిశకేగు వారలు గంగా బ్రహ్మపుత్రా ముఖద్వారములను దాటి ఇండోచైనామీదుగా బంగారపు గోడలుగల సువర్ణద్వీపమున కేగవలెనని యాజ్ఞాపించెను. బృహాత్కథాసారమగు శ్లోక సంగ్రహమునను, నిద్దేశ మిలింద పన్హొయను బౌద్ద గ్రంథములందును, చైనానుండి సముద్రముపై దక్షిణముగ బోవువారలు జూచుదేశములలో బర్మాదేశమును జావాసుమత్రా దీవులును బేర్కొనబడినవి. బౌద్దవాఙ్మయమునుండి ప్రాచీనకాలమున సుమాత్రాద్వీపమున బంగారము విశేషముగ దొరుకునను నాశతో నెల్లరు నటకేగు చుండిరని తెలియుచున్నది. క్రీ. శ. 7 వ శతాబ్దమున "ఈత్ సింగ్‌" అను చైనాదేశ యాత్రికుడు సుమాత్రాలోని శ్రీవిజయ రాజ్యమునకేగి, యటనుంచి హిందూదేశమునకు రాక పోకలను జరుపు నారాజు యోడలలో నొకదానిపై బయనము చేసి తామ్రలిప్తి నగరమునుజేరెను. దక్షిణహిందూదేశమున రాజ్యమేలిన చోళరాజుల శాసనములలో శ్రీ విజయరాజ్య ప్రశంస గలదు. 11 వ శతాబ్దమున దక్షిణ హిందూదేశమునందలి నాగపట్టణములో శ్రీ విజయరాజగు చూడామణి వర్మ యొక బౌద్దాలయమును గట్టింప