పుట:Bharatiyanagarik018597mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3) ఇండోచైనా :- ఇందలి వోకన్ [Vocon] అను చోట దొరకిన శిలాశాసనము రుద్రదాముని గిర్‌నార్ శాసనమును సర్వవిధముల ననుకరించుచున్నది. చంపా రాజ్యము [ఇప్పటి Annam] నేలిన మొదటి భద్రవర్మకు "దర్మమహారాజ" అను బిరుద ముండెడిది. ఇది యాంధ్ర పల్లవరాజుల బిరుదము. ఈ ప్రాంతమునందుండిన హిందూరాజ్యములలో పూనన్ [Funon] మఱియొకటి దీనిని స్థాపించి హిందూమతమును వ్యాపింపజేసిన కౌండిన్యుడను బ్రాహ్మణుడు ద్రోణాచార్యుని తనయుడగు నశ్వద్దామవద్దనుండి యొక యీటెనుగొని యీదేశమున బ్రతిష్ఠించెననియు, నిచట నొక నాగకన్యను వివాహమై రాజ్యభారమును వహించెననియు, క్రీ. శ. 579 నాటి యొక శాసనము దెల్పుచున్నది. ఆంధ్రపల్లవులలో చూతపల్లవుని కుమారుడగు వీరకూర్చవర్మ నాగకన్యనుద్వాహమై రాజ్యమును సంపాదించెను. ఈ పైకౌండిన్యునిగాథ యీ చారిత్రక విషయమునకు సరియగుచు, బల్లవుల కీ పూనన్ రాజ్యముతోగల సంబంధమును జూపుచున్నది. వేంగీరాజ వంశీయుల నామములగు చంద్రవర్మ, దేవవర్మ, జయవర్మయను నామము లీ పూనన్ రాజులకుగూడ గాంచనగుచున్నవి. చంపా రాజ్యమునను, కళింగదేశమునను గూడ ఇంద్రవర్మాభిరిధులగు రాజులు పెక్కుండ్రుగలరు. ఇండోచైనాలోని శాసనములన్నియు సంస్కృత భాషయందును, చాళుక్యలిపిలోను వ్రాయబడియున్నవి. వీనిలో శాలివాహన శకముగూడనున్నది.

(4) సింహళద్వీపము :- ఆంధ్రదేశమునకు ను సింహళ ద్వీపము [Ceylon] నకును సన్నిహితమగు సంబంధ ముండెడిది. దుత్తగామినియగు భిక్షు నాంధ్రదేశమునుండి బుద్దుని యవశేషములను సంపాదించి, దంతపురమున స్థాపించియొక స్థూపమును గట్టించెను. ఆసమయమున జరగిన సమావేశమునకు పల్లవ భోగమునుండి వేలకొలది భిక్షువు లేగిరి. ఈ పల్లవ భోగము నిప్పటి గుంటూరు మండలములోని పల్నాడు [పల్లవ - నాడు] తో