పుట:Bharatiyanagarik018597mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము

9. ఆంధ్రదేశము - ప్రాగ్భారత దేశములు.

ఇంతవరకును దక్షిణహిందూదేశమునకును బ్రాగ్భారతభూములకునుగల సంబంధమును పేర్కొని యుంటిమి. ఈ దేశాంతరములలో భారతీయనాగరికతను విస్తరించునెడ నాంధ్రదేశ మెక్కుడుగ బాల్గొనియుండెను. ఈ విషయమై గొన్నివివరము లిట పేర్కొనబడుచున్నవి.

ఆంధ్రదేశమున దక్షిణమున పులికాట్‌చెరువు మొదలుత్తరమున కళింగపట్టణము వరకును దీర్ఘమగు సముద్రతీర ముండుటచే, సముద్ర యానమునకు సౌకర్య మెక్కువగనుండినది. వంశధారా, గోదావరీ, కృష్ణా, పినాకినీ నదులమూలమున లోభాగములకుగూడ నౌకలు పోవుచుండినవి. క్రీ. శ. 12 వ శతాబ్దములనాటివగు (Pariplus of the Erythrian Sea and Ptolemy's Geography) లలోనా కాలమున కృష్ణాగోదావరీ ముఖద్వారములనుండి నౌకలు దూర్పునకేగుచుండెడివని వ్రాయబడినది. ఈ కాలమున రెండురకముల నౌకలుండెడివి. ఒక విధమైనవానిని తీరమునందలి వాణిజ్యమునకును, మరియొక విధమగు వానిని విదేశవాణిజ్యమునకు నానాటి యాంధ్రులుపయోగించు చుండిరి.

బహుప్రాచీన కాలమునుండియు నాంధ్రదేశవాణిజ్యప్రశంస గలదు, భీమసేన జాతకమునం దీదేశము నేతపరిశ్రమకు ముఖ్యస్థానమని చెప్పబడియున్నది. పర్తియాలలో వజ్రపు గనులును, వినుకొండలో రాగి గనులును, పల్నాడులో సీసము చలువరాళ్ళుగలగనులు నాకాలమునం