పుట:Bharatiyanagarik018597mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) వలసపోవుట :- సాధారణముగ దేశాంతర సామ్రాజ్యనిర్మాణమునకు వాణిజ్యము మార్గదర్శకము. యీప్రాచీన దాక్షిణాత్యవర్తకుల వెంటనే యితరులనేకు లీదూరదేశములకు వలసపోయిరి. క్రీ. శ. 1 వ శతాబ్దిమధ్యభాగమున శకులు భారతదేశమున గల్లోలమును గల్గించిరి. దానికిఫలితముగ దేవియులు గొందరు విదేశముల కేగి యుందురు. క్రీ. శ. 78 లో అజీశకుడనునతడు పశ్చిమతీరమునుండి కొందరనుచరులతో సముద్రముపై బ్రాగ్దిశకేగెనని తెలియుచున్నది. అటుపై భారతదేశబ్రాగుత్తర దిశనుండు సముద్రతీరమునుండి యనేకులు జావాద్వీపమునకు వలస పోయిరి. వీరిలో చాలమంది మహానదీ గోదావరీతీరవాసులు, మలేద్వీప కల్పవాసులు, భారతదేశమునుండి యటకేతెంచినవారిని "కెలింగ్" లేక క్లింగు" లని పిలచుచున్నారు. యీపదములకు "కళింగదేశీయు" లని యర్థము.

(3) గాదలు :- అగస్త్యమహర్షి భారతదేశముననే యార్యనాగరీకత ననార్యమగు దక్షిణాపథమున విస్తరింపజేసెనను ప్రతీతి గలదు. ఇండోచైనా, జావాద్వీపములలోగూడ నీతడు జ్ఞానప్రదాతగా నారాధింపబడు చుండెను. 'అకిత్తజాతక' మను బౌద్దగ్రంథమున నీయగస్త్యుడు దక్షిణ హిందూదేశమునుండి 'కారద్వీపము' న కేగెనని చెప్పబడియున్నది. యీ దీవి బ్రకృతము (Celebes) అని వ్యవహరింపబడుశ్రీబోజద్వీపరాజ్యము నందుండినది. జావాద్వీపమునందు విచిత్రములగు విగ్రహములు గలవు. అవి పొడుగైన గడ్డమును చక్కనివస్త్రమును ధరించిన యొక వృద్దునివి. "భతారగురు" లేక "మహాగురు" యను నీవిగ్రహములు శివాలయములలో నెలకొల్పబడి బ్రత్యేకముగ నారాధింపబడుచున్నవి. భతారయనగా మళయాళములో శివుడనియర్థము. అగస్త్యమహర్షి శివభక్తుడు. గాన నీయనద్వీపవిగ్రహము లగస్త్యునివని స్పష్టమగుచున్నది. క్రీ. శ. 240 లో కంబోదియాదేశపు రాజొకడు 'మావ్‌లన్‌' (Mao Lun) అను విదేశ