పుట:Bharatiyanagarik018597mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలి యితరజాతులవలెనే భారతీయులనుగూడ తమ సంస్కృతిని బోధించి నంతరింపజేయు చుంటిమని వారు తలంచుచున్నారు. కాని భారతీయ నాగరికతా విస్తరణ చరిత్ర మీయభిప్రాయములయందలి యసత్యతను వ్యక్తము చేయుచున్నవి. నేటి ప్రపంచమున బ్రబలురుగనున్న పాశ్చాత్య జాతులవా రనామధేయులుగను, అనాగరికులుగను ఉండినకాలమున, భారతదేశము నాటి ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచమునంతటికి నధినేతయై, వివిధదేశములలో విజ్ఞాన బీజములను వెదజల్లి విశ్వమానవ కల్యాణమును చేకూర్చెను. పసుబలముచే జయింపబడి, నిర్మింపబడిన నేటి సామ్రాజ్యములకును, నాడు భారతీయులు నిర్మించిన సుస్థిరమగు నాధ్యాత్మిక సామ్రాజ్యమునకును పోలికయేలేదు.

భారతదేశ చరిత్రమున కింత ముఖ్యమగు నంశమైనను, దీనిని గూర్చి యాంధ్రభాషలో నొక గ్రంథమైనను వెలువడియుండలేదు.1922 వ సంవత్సరమున "భారతీయ నాగరికతా విస్తరణము" అను శీర్షికతో నేను త్రిలింగ, రైతు, గోల్కొండ పత్రికలలో గొన్ని వ్యాసములను ప్రకటించియుంటిని అటుపై మరికొంత సామగ్రిని సమకూర్చుకొని యీగ్రంథము తయారుచేసితిని. పిమ్మట నొక ప్రసిద్ధులగు గ్రంథప్రకాశకులు దీనిని ప్రకటింతుమని వాగ్దానముచేసి, తమవద్ద మాతృకను రెండేండ్లకాలము నిల్వ యుంచుకొనిరి. తుదకు మాతృకనుగూర్చి "అస్తి నాస్తి విచికిత్ప" గూడ గలిగినది. ఎట్లో యదృష్టవశమున నిది తిరిగీ నాకులభించినది. నేటికైన నిది ముద్రింపబడుట మిక్కిలి సంతోషకరము.

కలకత్తాలోని "Greater India Society" వారి ప్రకటనలు మ, నయాం, కాంబోడియా, చంపారాజ్యములనుగూర్చిన ప్రత్యేక గ్రంథ