పుట:Bharatiyanagarik018597mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేర్చెను. ఇదేకాలమున చైనాదేశములో మతప్రచార మొనర్చుచుండిన ధర్మక్షేముడను భారతీయభిక్షువు, మహాయాన గ్రంథమగు మహాపరినిర్వాణ సూత్రమును భాషాంతరీకరించునపుడు కోటానుదేశమున కెన్నియోసారులు యాత్రలనుజేసెను. క్రీ. శ. 493 లో నీదేశమున జరగిన పంచవార్షిక సభకు, చైనాభిక్షువులుగూడ వచ్చి కొన్ని యుద్గ్రంథములను సంపాదించిరి. సర్వవిధముల నీకాలమున కోటాన్‌దేశ మొక సుప్రసిద్ద విద్యాస్థానముగ నుండినది. ఇటనుండియే గొన్నివిజ్ఞానకిరణములు చైనాపైబ్రసరించినవి.