పుట:Bharatiyanagarik018597mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయించిరి. క్రీ. శ. 663 లో నీఇస్లాముమతస్థులు సుప్రసిద్దమగు నవ విహారసంఘారామమును నాశమొనర్చి కాబూల్‌ను బాల్‌ఖ్‌ను వశపరచుకొనిరి. 8 వ శతాబ్దమున నీ చంద్రద్వజులు బెలూచిస్థానమును జయించి పంజాబులోని ముల్తానువరకును విజృంభించిరి. అనతికాలమునకే బమియన్ రాజ్యమును మహమ్మదీయమతము నవలంభించెను. ఈదేశమిట్టి విప్లవములకులోనైనను భారతీయ నాగరికత యిట బూర్తిగా నశింపలేదు. క్రీ. శ. 753 లో గాంధారమున సుఖావతి పద్మావతియను రెండువిహారము లుద్యాననగరమునం దుండినవి. క్రీ. శ. 785-810 ల మధ్య కుభా (కాబూల్) నగరవాసియగు ప్రజ్ఞుడను శ్రమణుడు కొన్నిబౌద్దగ్రంథములను చైనాభాషలోనికి తర్జుమాచేసెను. నగరహారమునందలి యొక బ్రాహ్మణకుటుంబమునకు జెందిన వీరదేవుడనుభిక్షువు మహాబోధీయాత్రనుజేసి పిమ్మట వంగ రాజగు దేవపాలునిచే నాలందా విద్యాపీఠమున కధ్యక్షుడుగ నియమింపబడెను.

9 వ శతాబ్దిలో పర్షియాదేశమునుండి మఱియొక మహమ్మదీయ విజయతరంగ మేతెంచి ఆఫ్‌గనిస్థానము నంతటిని గలంచివైచెను. క్రీ. శ. 870 ప్రాంతమున కాబూల్‌రాజ్యమును తురుష్కజాతికి జెందిన షాహియ వంశీయు లేలుచుండిరి. వీరు బౌద్దులు. ఇందు కడపటిరాజును తుదముట్టించి యాతని మంత్రియగు 'లల్లియ' యనునతడు రాజ్యమును వశపరుచుకొనెను. ఈ లల్లియకు నీతని సంతతివారికిని "ఒహింద్‌అగర్ హిందూషాహియు" లని పేరు. దక్షిణహిందూ దేశమునందలి విజయనగర రాజులవలె నీవంశపు రాజులు హిందూమతోద్దరణ దీక్షితులై మహమ్మదీయులతోబోరి. తుదకు దమసర్వస్వమును గోల్పోయిరి. లల్లియ సింహవ్యాఘ్రములబోలు దరదతురుష్క రాజ్యముల మధ్యనుండిన తన రాజ్యమును కడునిపుణతతో గాపాడుకొనెను. గాంధారము, ఉద్యానము, పంజాబులోని గొంత