పుట:Bhaarata arthashaastramu (1958).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయాసగ దోపదు. అనురక్తి లేనివానికి గొంచెపాటి ప్రయాసమును ఘనముగ దోచును. కామాతుఠునకు గష్టంబులు గష్టంబులుగ గానబడవు. వాడెట్టిగోడలనైనను దుముకుటకు వెనుదీయడు. ఏకార్యమందైన నాసక్తిగొంటిమేని దానివలన గలుగు దేహమన:పీడనంబులు బుద్ధికిందట్టవు. ఆకలిచే నాకులుడైన వానికి గోడ దుమికి తోటలో బ్రవేశించి చెట్టెక్కి పండ్లుగోయుట యశ్రమమైన కృత్యముగా గనుపించును. ఈ కార్యమునే సంతర్పణచే దృప్తుడైన వెనుక వానిం జేయుమన్న "అయ్యో! ఇట్టికార్యము నాచేత నవునా?" యని యూరకుండును. ఆవశ్యకము అసాధ్యముగాదు. అనావశ్యకమని తోచిన యెడల సులభసాధ్యంబును అసాధ్యమగును.

5. వాంఛయు దత్పరిపూరణార్ధమైన యత్నమును శమించుటకు మూడుకారణములుగలవు. ఇవిమూడును ఏకకాలమున బ్రవర్తిల్లుటయేకాక పరస్పర నిర్ధారితములు నయియున్నవి. ఈ కారణము లెవ్వియన:- ప్రయత్నము జేయజేయ బాధతోబాటు ఫలమును అతిశయించుటచే ననురాగము క్షీణతకువచ్చి తుదకు బొత్తుగ నశించిపోవుట. అనురాగము హీనమౌకొలది కష్టము తక్కువగానున్నను ఎక్కువగాదోచి తుదకు సహింపరానిదగుట. బాధ యెక్కువ యగుటచే ఫలముమీది మమత కృశించుటయు ననునవి పరస్పర నిర్ధారితములంటిమి అనగా వాంఛచే శ్రమయు శ్రమచే వాంఛయు నిర్ణీతములనుట. ఈ విషయమునే నిదర్శనపూర్వకంబుగ దెల్లం బొనర్తము. కోడికి గ్రుడ్డును, గ్రుడ్డునకు గోడియు ఆధారభూతములనుట సర్వవేద్యము. వాంఛ హెచ్చిన శ్రమ తగ్గినట్లుండును. శ్రమ హెచ్చిన వాంఛకృశించును. వాంఛ యెంతయెక్కుడుగనుండునో యంత యెక్కువ శ్రమచేయ నుద్యుక్తుల మగుదుము. ఐనను ఎట్టి శ్రమచేతను సాధింపరాని వస్తువులం దాశగొనుట యసంభవము. అందరాని పండ్ల కఱ్ఱులుసాచుట నరునకు నైజగుణంబుగాదు. ఒక్క