పుట:Bhaarata arthashaastramu (1958).pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశములో కో ఆపరేటివ్ ఋణసంఘములు ప్రకృతము బహుత్వరితగతి వ్యాపించుచున్నవి. వీనింగూర్చిన వివరము లికముందు దెలుపబడును.

కో ఆపరేటివ్ వ్యవసాయము మొదలైన యుత్పత్తి కార్యములు నిర్విఘ్నములుగ నెరవేఱవలయునన్న కో ఆపరేటివ్ విక్రయశాలలతో సంధిగలిగియుంట మంచిది. అట్లయిన సరకు లమ్ముడువోవు మార్గము సిద్ధము. ఇంగ్లాండులో పరస్పర వర్గములచే బాలితములైన భూముల విస్తీర్ణత సుమారు 2000 ఎకరములు. ఇవి ధాన్యములు, పండ్లు, పశుసంతానములు, వెన్న, పాలు, జున్ను ఇత్యాది వస్తువుల ప్రాప్తికి నాధారములు. మఱియు నీవర్గములు విభజన వర్గములతో సాంగత్యము గలిగి యుండుటంబట్టి యీ పదార్ధములు విక్రయశాలలవారిద్వారా యా సంఘములకుం జేరిన శ్రమకరులు మొదలగు వారలకు ననాయాసముగ నమ్ముడువోవును. విభజన వర్గములవారే తమకు సరకు లడ్డులేక లభించుచుండవలయునను కోరికచే భూముల గొని పంటబెట్టుటయు, వస్తురచనకై ఫ్యాక్టొరీల స్థాపించుటయుం గలదు. ఇందుచే వ్యక్తమగునీతియేదన, సజాతీయములైన వినియమ శాలలతో గలిసియుండినంగాని పరస్పరతా పద్ధతిమై ప్రారంభింపబడిన యుత్పత్తికార్యము కొంతవఱకు జయశీల మైనను తప్పక నిండుజయమొందునను నిశ్చయములేనిదగును. నిర్వికల్పసిద్ధికి కో ఆపరేటివ్ అంగళ్ళతోడి సంయోగము ప్రధానము.

కో ఆపరేటివ్ ఉత్పత్తిశాలలు

(ఇంగ్లాండులోనివి)

ఇంగ్లాండులో వస్తువుల రచించుకార్యమున బ్రవేశించియుండు పరస్పర సంఘములసంఖ్య సుమారు 120. ఇందు సేవకులకు లాభము నను కార్యవిచారణమునను వంతునొసగి పరిపూర్ణ పరస్పరతగల యవి సుమారు 75 మాత్రమే. తక్కినయవి లాభమును భాగస్థులకును