పుట:Bhaarata arthashaastramu (1958).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు గొన్ని యుత్పత్తికాండమునకును గొన్ని విభజనకాండమునకును జేరినవి. ముఖ్యాంశముల మాత్రమిట సూచింతము.

నిక్కమైన యన్యోన్యతా పద్ధతియొక్క ముఖ్యలక్షణము లెవ్వియన

1. యజమానులును లాభనష్టములకు బాత్రులునైన భాగస్థులలో నందఱో కొందఱో యా యావేశనముననే పనికి గుదురుట.

2. భాగములుగలవారు గాకపోయినను శ్రమకరులుగూడ కూలి గాక లాభములో నొకపాలు వడయు వారుగను, ఆవేశనము నడుపు నాలోచన సభయందు జేరినవారుగను నుండుట.

ఈ లక్షణమ్ములు చక్కగ బట్టువడియేనేని సామాన్యమైన వ్యవహారసమాజములయందలి దోషములు వాయును ఎట్లనిన:-

1. శ్రమకరులకును యజమానులకును గాఢమైన సంయోగము సిద్ధము. కావున వీరిలో వీరికి వైరస్యము సంభవించుటయు, కర్మోపహారము మొదలగు నాపదలు పుట్టుటయు దొలంగును.

2. ఆవేశన తంత్రంబున భాగస్థులు తూగుబోతులుగానుండక యజమానత్వము సార్థకముంజేతురు. యజమానులలో ననేకులు శ్రమకరులును నగుటంజేసి చోదనశక్తి యలవడినవారై కార్యంబుల స్వబుద్ధితోనేర్చి తీర్పజాలుదురు.

3. సామాన్య సమాజములలో నావేశనముండుచోటు ఒకటి. ఇక భాగస్థులన్నలో దిక్కుదిక్కు లనుండియు రావచ్చును. ఇంగ్లాండులో బ్రబలములైన కంపెనీలలో ఇండియా మొదలైన తూర్పు రాజ్యములవారును భాగములుగొనుట సర్వసాధారణమైన క్రియగా నున్నది. నిర్మాతలయొక్కయు చోదకులయొక్కయు నాణెమును పరువునుజూచి యా వ్యవహారముల స్వరూపమునైన నేమాత్రము నెఱుంగనివారుసైతము మూలధనము నిక్షేపించుట మిక్కిలియు వ్యాప్తమైనవాడుక. ఈ విశ్వాసము మొత్తముమీద నుచితమైనది.