పుట:Bhaarata arthashaastramu (1958).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమచే నీకార్యమును విచారించుటకై నియుక్తులైన యుద్యోగస్థుల మూలముననైనను, ఆ వెలల దగ్గింపవచ్చును.

3. వ్యాపారము వర్తకము వీని నిరోధించుటకై యేర్పఱుపబడిన పద్ధతులును నిబంధనలును న్యాయ స్థానములవారు రద్దుచేయవచ్చును. ఈరీతినే కృత్రిమధరల స్థాపించుటకై నియమింపబడిన సంఘములు, ఒడంబడికలు, మొదలగునవి శాసన విరుద్ధములు.

4. గవర్నమెంటువారు ఆ యా ట్రస్టులయు సంఘములయు స్థితిగతులను జర్యలను నారసి తమకు యుక్తమనితోచిన నాయుదంతములనంతయు బ్రజలకు బ్రకటన రూపమున జాటి చెప్పవచ్చును.

ఇట్లనేకములైన కఠినశాసనముల విధించినందున బ్రకృతము సంధిసంఘములు బలమఱియున్నవి. రాకిపెల్లరుగారు ప్రతిష్ఠించిన కిరోసిన్‌నూనె సంఘమును 1911 వ సంవత్సరమున గవర్నమెంటువారు శాసన విరుద్ధములైన దుర్మంత్రంబులజేసినట్లు నిరూపించి రద్దు చేయించిరి. కొన్నినెలలక్రిందట నాసంధిక్రియ యంతమునకువచ్చి ప్రత్యేక శాలలు పునరుద్భూతములైనవి.అయినను లోలోపల నేమి కుట్రలు జరుగుచున్నవో యెఱుగ నెవరితరము? నాటకములోని వేషధారులవలె నాసంఘమే నామాకార భేదముందాల్చి మఱియు నవతారమెత్తునేమో! ఒకసంవత్సరమైన గడచినంగాని యదినిజముగ జచ్చెనా, లేక యూపిరి బిగబట్టుకొని దొంగచావుతో నున్నదా యనుట విశదమగుట దుర్ఘటము.

సంధిసంఘముల యాజమాన్యముం దాల్చినవారును కార్యదర్శులును భాగస్థులు మొదలగువారిని నింకను నొకవిధమ్మున దోచుటయుంగలదు. మర్మములన్నియుం దెలిసినవారుతాము. వీరు చెప్పినది నమ్మియుండవలసినవారు భాగస్థులు. అట్లగుట దమవ్యాపారమేదో కారణంబున జెడుచున్నదని వదంతిని గల్పించి యది నిజమనినమ్మి భీతిచే ననేకులు తమభాగముల నమ్ముటకురాగా దక్కువవెలకు