పుట:Bhaarata arthashaastramu (1958).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామగ్రి నమ్మినవారికిని మునుపటి నిబంధనల ప్రకారము బదులిచ్చి తీఱవలయుగాన నట్లుసేయ శక్తులుగాక సంతసింతురు. ఉత్పత్తి ప్రారంభంబున ధరలు హెచ్చుగను నుత్పత్తి ముగియునప్పుడు తక్కువగనునున్న నష్టము సిద్ధము. అట్టితరుణములో నేక కాలమ్మున సర్వవస్తువులు నమితములై నట్లు వ్యవహారులకు దోచుగాని దీనిచే వస్తువులగొని వినియోగించువారికి మేలుగాని కీడులేదు. సరకులు నయములైన వినిశ్చితమైన యాదాయముగల గవర్నమెం టుద్యోగస్థులు మొదలగువారికి నఱచేతికి వైకుంఠ మబ్బినట్లు.

రూప్యములు మొదలగు నాణెములు తఱుచుగ నధికములైన వెలలు హెచ్చును ఇందుచే నుత్పాద కులకు వర్తకులకు సంతోషమే యైనను నిర్ణీతమైన వచ్చుబడిగల యుద్యోగస్థులు మొదలగువారు వస్తువులు ప్రియములౌటచేత నెక్కువ వ్యయమునకు బాత్రులౌదురు.

నాణెముల స్థితిగతులచేనగు సుఖదు:ఖ విచారణలును వినిమయ కాండాంతర్గతంబులు.

ఏకకాలమ్మున నేకక్రమమ్ముగ వస్తువులయు రూప్యములయు సంఖ్యలు విశాలము లయ్యెనేని యమితోత్పత్తిదోషం బుద్భవిల్ల దనుట యదార్థమేయైనను, పూర్వమే చెప్పినట్లు సద్య:కాల జన్యస్థిత్యంతరములు వ్యవహారలోకమ్మున మృగ్యములు. ఉత్పత్తి యథారీతిని నన్నిపదార్థంబుల యందును విస్తృతంబగుట స్వభావాతీతముకావున నార్థికగండముల మొదలంట దెగవేయవలయుననుట కొలదికి మీఱిన యోచన.

క్షోభలు వ్యక్తిస్థితిచే సంభవించునవియను వాదప్రకారము

సమష్టివాదులు తమమతమైన సంఘనాయకత్వమును స్థాపించుటకై యీ క్షోభల నూనియున్న యాధారంబొకటి చూపెదరు. ఎట్లన, నుత్పత్తి యమితమగుటకు హేతువు ప్రజల దారిద్ర్యముచే నైన గిరాకియొక్కశక్తి శూన్యత. ప్రజలనగా నెవ్వరు? ముఖ్యముగా