పుట:Bhaarata arthashaastramu (1958).pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి చిత్తము స్తిమితము! మనలో నిమిషమునకు నొకరుచి, రుచికి రెండరుచులుగా నుండును. కావున మనుష్యకల్పితము లమితభంగులు గలయవి. ప్రకృతి కల్పితములు మితభంగులు. కల్పనాశక్తి యెట్లో రుచులునునట్లే. సహజములైన బుభుక్షాదివాంచలు సామాన్యములు విస్పష్టస్వభావములు. నాగరకత, విద్య, భావనాశక్తి, చిత్తచాంచల్యం వీనిచే బ్రేరేపింపబడు వాంఛ లమేయములు. వీని స్వరూపముం బూర్ణముగా నెఱుంగ నేరికిని నలవిగాదు.

రచితములు రెండు తెఱంగులు. అల్పరచితములు, విశేషరచితములు. స్వల్ప రచితములు:- కడ్డీయినుము, కడ్డీబంగారు, కత్తులు, నాగేళ్ళు, పాఱలు, గడ్డపాఱలు ఇత్యాదులు.

విశేషరచితములు - కాశీచీరలు, సుందరముగ జెక్కబడిన కొయ్యలు, చిత్రములు, ప్రతిమలు, ఆభరణములు మొదలైన యలంకార సామగ్రులు.

ఈరెండువిధములలో స్వల్పరచితములకు పణ్యసౌలభ్యమెక్కువ. వీనియందు విస్తార కర్మశాలలకు మంచి యాశ్రయము గలదుగాన నవి ప్రబలములయి చిల్లర యంగళ్ళ జీకాకుపఱచుచున్నవి. విశేషరచిత ములు మెప్పూనూనియుండునవిగావున విస్తారోత్పత్తికి నివి ఎత్తినవిగావు.

కావున మనసిద్ధాంత మియ్యది. అధికవృద్ధి న్యాయాకారములైన వృత్తులలో స్వల్పరచనాకళలందప్ప దక్కుంగల కళలలో విస్తారోత్పత్తికి నెడమున్నదిగాని తత్సదృశ్య విక్రయమునకు నెడము లేనందున నుత్పత్తి యపారంబు గానేరదు. స్వల్ప రచనాకళలయందు గంభీరములైనశాలలు, అల్పశాలలకు మృత్యునిభమ్ములు. హీన వృద్ధికింజేరిన పరికర్షణ కళలయందు క్రయవిక్రయము లనాయాసముగ నడువబోలినను విస్తారోత్పత్తి సులభసాధ్యంబుగాదు.

మేలియంత్రముల సాయముచే వృద్ధిగాంచు మళిగెల జీవిత మనిత్యము. ఇంకను నుత్కృష్టములైన యంత్రముల నితరులు నిర్మింప