పుట:Bhaarata arthashaastramu (1958).pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూల్య ప్రాతికూల్యముల నిర్ణయించి త్రోవజూపువారు ఘనులు. వారిననుసరించిపోవువారు చిన్నలు.

అయినను బరిమిత వ్యాపారుల పరంబులైన యానుకూల్యములును గొన్నిగలవు. అవి యెవ్వియనిన:-

1. తామే స్వయముగ నన్నింటిని విచారించుకొనుట సులభకార్యము. మధ్యవర్తులైన విచారణకర్తల నమ్మియుండవలసిన విధిలేదు.

2. బంగారు, వెండి, రత్నములు ఇత్యాది పరమమూల్యములైన వస్తువుల రచనయందు యజమానుల కంటికిదూరములైన క్రియలున్న నష్టముతప్పదు. ఈ వ్యాపారమందలి మళిగెలు మిక్కిలియునల్ల నేరవు.

3. వర్తమానమున సీమసీమల వృత్తాంతములును వార్తాపత్రికలు దొరతనమువారి ప్రకటనలు వీనిచే నెఱుంగుట సాధ్యంబుగాన నార్థికస్థితిగతుల గుఱించిన జ్ఞానము గొప్పవారితో నించుమించు సరిసమముగ దమకు నలవడుటయుం గలదు.

4. యంత్రాదులయందలి వృద్ధికరములైన సంస్కారములను బ్రకృతి శాస్త్రజ్ఞులు గనిపెట్టునట్లు వ్యాపారులు గనుగొనుట యసంభవము. శాస్త్రజ్ఞులు విద్యాదాన మెల్లరకు సమాదరముతో జేతురు గాన సంస్కరణ జ్ఞానము దుష్ప్రాపంబుగాదు.

5. వాడుకకాండ్ర గుర్తెఱిగి వారిమనసులకుం బ్రియమైన గతుల నడుచుటకు నవసరము గలవారుగాన దమవస్తువులు గిరాకి విశేషించి యెదుగకున్నను దఱచు కుందు నొందుటయులేదు. కావున విస్తార వ్యాపారసముద్రముపొంగి తమ్ము గొట్టికొని పోవుననుభయము సకారణముగాదని గ్రహింపవలయును.

సవిస్తరత యన్నివృత్తులయందును సమవర్తి కాదనుటయు దెలిసియున్నది. వృత్తుల గుణంబులకును విన్యాస సౌలభ్యమునకు నుండు ప్రవృత్తి యెట్టిదనిన:-