పుట:Bhaarata arthashaastramu (1958).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక సంఘమునకన్ననో దాని స్వాతంత్ర్యము సహజముగ మఱియు దక్కువ. అట్లగుట మనచర్యలు ప్రకృతి చర్యలతో నించుమించు సమానములు. సంఘమింకను బ్రకృతిం బోలినదియైయుండును. కావున దానియందు బ్రవర్తిల్లు న్యాయములు ప్రకృతి న్యాయములట్లు కొంతకుగొంత యనివార్యములు ను స్వచ్ఛందములును.

దీనికి నింకను నొకప్రమాణము. ప్రకృతియందు స్వేచ్ఛావర్తనము బొత్తిగాలేదు. గాన నికముందు సంభవించువాని మున్నుగా నెఱుంగవచ్చును. తుపాకిలో గుండుపెట్టి కాల్చితిమేని, అది యేదిక్కున కైన నెగిరిపోవునని యెవడును శంకమానడు మఱి గుఱికొలది సూటిగా బోవుననుట నిశ్చయము. ఈ రీతిని బ్రతిమనుష్యుని జాడలును నెఱుంగబోలదు. అయినను సంఘముయొక్కజాడల ముందుగా నిర్ణయింపనంత దుర్దమముగాదు. వేయిమంది వేయికూతలు గూసిరిపో బాల్యవివాహ ములు త్వరలో నంతమొందునా? ఒందవు. కావున నిప్పటి యార్థికస్థితులు మనుష్యు లుద్దేశ్యపూ ర్వకముగ దెచ్చుకొన్నవికావని కొందఱి యభిప్రాయం. మఱి యెట్లేర్పడినవనగా బాశ్చాత్త్యుల ఖండములలో సహజస్పర్ధచేతను, మనలో సహజ ప్రాచీనాచార పారాయణత్వము, గ్రీకులు తురుష్కులు మొదలగు విదేశీయుల దండయాత్రలు మున్నగువానిచేతను నేర్పడినవి.

పాశ్చాత్త్యులు స్పర్ధమంచిదనియు, దానిచే నిపుడు వ్యాప్తిలోనుండుస్థితులు పుట్టువనియు మున్ముంద యెఱింగి వర్తించిరా? లేదు. ఇంతటి జ్యౌతిషము మ్లేచ్ఛులకు దెలియునా? తాత్కాలిక ఫలముల నాశించియో, సహజమగు క్షాత్రబుద్ధినో, స్పర్ధకుంజొచ్చిరి. కార్యకారణ సంకలనంబునం జేసి యీ సిద్ధులన్నియు జేకూరినవి.

ఇక మనజనులన్ననో, ఏపాపమునెఱుగని పశువులు. పగ్గములచే తమవారు బెఱవారు నీడ్వనీడ్వ గాలక్రమేణ తుదకీగతికివచ్చిరి. కావున నిప్పటిస్థితి మొత్తముమీద సహజ క్రమములచేవచ్చిన స్వయంభువు.

ఇకముందు గలుగబోవు పరిణామము సయిత మీరీతినే స్వభావసిద్ధమై తనంతట రానీయని మనమూరకుందుమా? లేక పూర్వికులకన్న మనము లౌకిక జ్ఞానమునందును ననుభవము నందును బ్రౌఢులముగాన ముందు జాగ్రత్తమై నీ యీ తెఱంగులనున్న మంచిదని యోచనతో నిర్ణయించి తగవైన శాసనముల విధించి భవిష్యత్తును బ్రతిమను దీర్చినట్లు తీర్ప బూనుదమా? సామాన్య సమష్టివాదులకును బ్రభుమార్గ సమష్టివాదులకునుగల భేద మీప్రశ్నలకు వారిచ్చు నుత్తరములచే విశదంభగును.

సామాన్య సమష్టివాదుల యుత్తరము

సంఘస్థితి మనుజులమూలమున బనిచేసెడు శక్తులచే నుత్పాదితము. మనుష్య కృతంబుగాదు. రాజశాసనములు, వర్ణధర్మములు ఇత్యాదు లనేక చలనముల గలిగించునవి యైనను మొత్తము మీద వాని ప్రభావ మంతఘనముగాదు. ఘనము లెవ్వియనిన స్వచ్ఛందములైన స్పర్ధాదులు. నీతి విన్యాసములంగోరు నుద్దేశ్యముల గుణము విస్తారమా? చూడుడు! సంఘసంస్కారవిషయమై హిందూ దేశములో చర్చలెన్నియోజరిగినను వర్ణసాంగత్యము,