పుట:Bhaarata arthashaastramu (1958).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాలలో, కొంతమంది రెండు మూఁడు క్రియలఁ జేయవలసిన వారయ్యు నొక్కొక్కదినమునకు నాశాలవారు 48,000 సూదులను విరచింపఁ గలిగిరి! అనఁగాఁ జేతులతోనే యన్ని పనులం జేయుఁజూచిన నొక్క సూదియైన ముగింపలేనివాఁడు, ఇతరులతోఁగలసి పనుల భాగించుకొని, ఏకక్రియాశక్తిమై యంత్రశక్తి యలవరింఛి యత్నించిన దినమునకు 4800 సూదులంజేయఁ ప్రవీణుఁడౌననుట! శ్రమ సంశ్లేషణ ప్రభావము నకు నత్యాశ్చర్యకరంబైవ యీ యుపమాన మొక్కటిచాలదా? ఇది నూఱేండ్లక్రింద ఆదాముస్మిత్తుగారు, అనుభవపూర్వకమ్ముగ శోధించి స్థాపించిన న్యాయము. ఇప్పుడు మనకాలములో యంత్రశక్తి యమేయమై వినువారికిం గనువారికిని వెఱగుఁబుట్టించునదియై యున్నది. అప్పుడు 10 మందిచేఁ బరిష్కృతములైన సూదుల సరాసరి పరిమాణము దినమునకు 12 పౌనులు. నేఁడు యంత్రప్రభావముచే దినమునకు 1000 మంది పరిష్కారముచేయు సూదులతూనిక టన్నులు. టన్నులనఁగా 7840 పౌనులు, నూఱేండ్లక్రిందట నప్పుడు హరువుపరువుగలవని పేరువొందిన పద్ధతుల ప్రకారము, ఒకనిచేనైనది పౌను మాత్రమే. ఇప్పుడో సర్వసాధారణముగఁ బ్రతిశిల్పియుఁ జేయఁగలిగిన సూదులకొలఁతయే ఇంచుమించు 8 పౌనులు! సమర్థత యొక్క శతాబ్దములో నేఁడు రెట్టు లధికమయ్యె. ఏమిచెప్పవచ్చు!

రాకపోకలు లేనికాలములోఁ బ్రతిగ్రామమును సకల సామగ్రీ సంభూతికి నాస్పదమై యుండవలసివచ్చెఁగదా! ప్రయాణసౌకర్యముగల యీ దినంబులలో వాణిజ్యవ్యాప్తిచేఁ గోరినవస్తురాసులఁ దెప్పించు కొనుట యనువుగాన సంపూర్ణ సామగ్రిలేకున్నను వెఱపులేదు. ఇంతే కాదు, మనుష్యులలోఁ బలె నూరులయందును వృత్తిభేదములున్న శ్రమ విశ్లేషణముచేఁ గలుము లఖండములై యలరారును. చెన్నపురి లోని జనులు తాముపెట్టిన పంటతోనే జీవించవలయునన్న అరదినపు భుక్తికైనలేక తపింతురు. పంటలలో తమకు న్యూనతయున్నను వాణి