పుట:Bhaarata arthashaastramu (1958).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జఱిగి, యవి తుదదాకనందున గర్మకరులు పనికిరామని సమయముజేసి నిలిచిపోయిరి. అందుచే నోడల ప్రయాణము క్రమముదప్పినందున సొంతగాండ్రకు నగణ్యమైన నష్టమువచ్చినది. పనివాండ్రకును గూలి రాదయ్యె. ఇట్లిరుపక్షములవారును గష్టములకుం బాత్రులయ్యును బంతము వదలుటెట్లని సమాధానము నాశ్రయింప నెవరునురారైరి. సేవకుల కండక్రొవ్వు నీఱుచేయవలయునని యజమానులు విశేషించి భరణమిచ్చెదమని యాశజూపి యీ పనులకు నితరుల నాశాపాశముచే నీడ్వసాగిరి. బీద లసంఖ్యులుగాన నందఱనొక కట్టుగా గుంపుజేర్చుట కెవరికి శక్యము? నౌకలందుండు నౌకరుల బృందమ్ములం గూడని పెఱనౌకరులు వీరికి స్థానభ్రష్టత్వ మాపాదించి సంపాదింతమను తమకమ్మున తండోప తండమ్ములుగ రాదొడంగుడు, గుంపుగా నవఘళించియుండిన ప్రాతసేవకులు వారిపై దండెత్తి ఱాలురువ్వి బాహియుద్ధముం జేయ జొరబడు తఱికి పోలీసువారు మధ్యస్థులుగ రావలసివచ్చెను. న్యాయాన్యాయము లెట్లున్నను దొమ్మిరేగి జను లొకరొకరిపై కయ్యమునకు నాయితంబైన గలబ లేకుండజేసి రక్షణకార్యంబు నెఱవేర్చుట రాజ్యాంగమువారి ముఖ్యకర్తవ్యముగదా! ఇట్లెన్ని యడ్డంకులు వచ్చినను వెనుదీయక యా కర్మకరులు జర్మనీ, హాలెండు, ఫ్రాన్‌స్ దేశములలోని సహకర్మకరులం దమకు సహాయము గావలసినదనికోరగా వారు తమతమదేశములలో దామును బనులకు బోవుట జాలించిరి. ఓడలకు నింగ్లాండులోనేకాదు, ఇతరదేశములందును బ్రయాణసన్నాహము కష్టసాధ్యమగుడు, యజమానులు కొంతవఱకుం బరిశ్రాంతక్షాత్రులైరి. పనివారును సంధికి సిద్ధముగా నున్నందున నెవరికిని ముఖము చిన్నపోగూడదని గవర్నమెంటువారు తామే మధ్యస్థులుగనిలిచి తీర్పుచేసెదమనిరాగా వారి పంచాయతీ తనమునకు నిరుదిక్కులవారు నంగీకరించిరి. మొత్తముమీద జయ మేరికన్న శిల్పిసంఘమునకే. సంబళము హెచ్చింపబడెను. భృత్యులు