పుట:Bhaarata arthashaastramu (1958).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బునంజేసి వృత్తిసామ్యంబు సేకూర్చు. ఆర్జనమున నెల్లరు దుల్య ప్రాభవులైన మర్యాదా గౌరవములందును దుల్యులౌట, సర్వజనులు నిమ్నోన్నతభావములేక యేకాసనాసీనులట్లుందురు.

ఆక్షేపణ. ఇది కవికల్పనంబోలినదిగాని నిజమేమాత్రము గాదు. చూడుడు! పరస్పరవైరంబున సర్వజనమైత్రి సిద్ధించుననుట విపరీత వాక్యముగాదా? దీనిలో నొకవిధమైన సత్యమున్నదిగాని యది వివరించితిమేని యసహ్యముగ దోపకమానదు. ఆ సత్య మేదన భూలోకములోనివారెల్ల ద్వేషబుద్ధిచే గలహంబులకుంబ్రారంభించి ప్రాణాంతమగువఱకును యుద్ధముంజేసిరేని, వీనిచేవాడు, పెఱవానిచే వీడుగా నందఱునుమడిసిన, చిట్టచివరకొక్కడుమాత్రము మిగులును. నిలిచిన వాడొక్కడేయైన, తనకన్న నెక్కువవారుగాని తక్కువవారుగాని యుండరుగాన వానియాయువు పర్యంతము నిమ్నోన్నతరహిత సమత్వము సిద్ధించుననుట! ఇది తర్కప్రకారసిద్ధమైన యంశమైనను విశ్వసనీయంబుగాదు. మఱివెక్కిఱింతమాట. ప్రజాక్షయ సంజనితంబైన ప్రళయకాల సమవర్తనము మాకెవ్వరికిని వలదు. మీకుం గావలసిన నింకొకలోకమునకు వెడలి గడించుకొనుడు! మాయెదుర నీవిపరీతములు విప్పకుడు!!

స్పర్ధయనగా వైరము. వైరముచే బలవంతులకు బలమును దుర్బలులకు దౌర్బల్యమును మఱింత హెచ్చి యెక్కువ తక్కువ లెక్కువయగుననుట సుప్రసిద్ధన్యాయము. దీనిచే బ్రళయకాలసమత్వం దప్ప ప్రయోజనకరములైన సమత లెవ్వియు బడయబడవు. పూర్వం ఆర్థికవైరము లల్పములుగా నుండినందున గుబేరులుగాని యష్ట దరిద్రులుగాని లేకుండిరి. ఇప్పటికిని స్పర్ధారహితములైన మనగ్రామములలో నాఢ్యాధములకు నాగరిక ప్రదేశములందుండునంత వ్యత్యాసము లేదు. ఐరోపాలో కోటీశ్వరు లొకవంకనున్న గోచికైన లేనివారొకవంకను; లక్షాధికారులకు వ్యతిరిక్తబింబములపగిది భిక్షాధికారులు