పుట:Bhaarata arthashaastramu (1958).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడుడు! ఈ దేశముయొక్క నిరుత్సాహస్థితి వేదాంత తత్త్వములవలన గలిగినదికాదు. ఆర్థిక స్థితిగతు లాచారములకు మూలములు. ఆచారములు వర్ధిల్లిన పదంపడి ఆకంపు నింపుచేయుటకై కల్పింపబడిన వ్యాఖ్యానములు తత్త్వములు. ఇట్టి నీరసతత్త్వములను నిస్సారులు గానివారెవ్వరును బాటింపరు.

మామూలు జీతములు విధులు నేర్పడియుండుట

గ్రామములో సర్వమును మామూలుచే నిర్దిష్టము. కూలి మామూలుకూలి. మేరలు మామూలు మేరలు. దానికి దగినట్లు పనియు మామూలునిద్రతో జేయుపనియే. స్పర్ధ, మాత్సర్యము నను నవీనగుణమ్ములు పారంపర్యమను ప్రాకారమునుదాటి రానేరకున్నవి. కూలివాంద్రు మెండైన జీతములు తగ్గవు. అరుదైన హెచ్చవు. బ్రిటిష్ గవర్నమెంటువారిచే నూతనోద్భూతములైన బాట, రైలువంతెనలు ఇత్యాది కార్యములలో జీతములు పురాతన వేతనములకన్న నధికములుగ జేయబడినను, తన్మూలమున గ్రామములోని కర్మకరుల భరణ మంతగా నుత్కటముగా లేదు. స్పర్ధలేమియు, నాచార గ్రస్తతయు గారణములు, అయిన నిందొక మంచిలక్షణము. వృద్ధి లేకపోయినను హీనతలేదు. స్పర్ధాపూరితములైన దేశములలో శక్తిగలవారు తేలుదురు. లేనివారు మునుగుదురు. మనలో రెండును మితిమించిపోవు. ఎంతదక్షులైనను కుమ్మరి, కమ్మరి మొదలైనవారు ధనికులౌట యప్రసిద్ధము. ఎంత యపకృష్టులైనను, ఏమియు గడింపక పోవరనుటయు సిద్ధమ. జరాభారముచే క్రుంగి యేమియు జేయలేక యున్నను కరుణాత్ము లిరుగుపొరుగువారు వారిం గూడు జీరనిచ్చి యుద్ధరింతురు. ఇదెంతయు నానందకరంబైన యాచారము! పూర్వ నివేదితములైన గ్రామములు ప్రత్యేక రాజ్యముల వంటివను న్యాయమున కిదియొక నిదర్శనము. ఏకరాష్ట్రీయు లెట్లు పరస్పరోద్ధరణ క్రియా పరాయణులై యుందురో, ఆరీతినె గ్రామ్యజనులు దమయూరివారియెడ