పుట:Bhaarata arthashaastramu (1958).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును మేముచూఱగొనెదము. మీకేమియు లేకపోయెనేయని మీరు చింతింపనేల! మీసత్కర్మము ఉత్తవోదు. ఇంకొకజన్మమున మీకు వడ్డీతో గట్టివచ్చును. కావున ద్వరపడకుడు! మీచేతిలోనుండు రొక్కము నిట్లు మాచేతిలో దిలోదకముతో వేయుడు. మీకు దేవలోకముపై బత్రము వ్రాసియిచ్చెదము" అనుట! వంచింపబడిన వారును నీచులౌటచేతనే ఈ మాయదారి సిద్ధాంతములకుం బ్రకృష్టత గలిగె. ఎట్లు నీచులందురో "సంఘ మేగతికిం బోయిన బోవనీ. మాజీవాత్ములు ఉచ్చస్థితి కెక్కినం జాలు" నను దురాశోపహతులౌట కతన. కావున గర్మము ఆత్మమాత్రప్రయోజకముగాని లోకముంజెందినది కాదుఅనుట లోభమను పుట్టనుండి వెల్వడిన విషపుబురుగు.

ప్రవర్తనల ఫలములు తన్నుజెందునో చెందవోగాని తప్పక సంఘమునకు మేలో కీడో చేయుననుటకు ప్రమాణములు:

అట్లుగానిచో ధర్మము లేల విధింపబడవలె? ధర్మముయొక్క ముఖ్యసంకల్పము సంఘముయొక్కయో, జాతియొక్కయో, ఉపజాతియొక్కయో, ఏదైన నొక సముదాయముయొక్క శ్రేయస్సో, లేక శ్రేయస్సని యెన్నబడినదియోకాని వేఱుగాదు. తనకుమాత్రము సంబంధించు కార్యముల ధర్మములను విధించుట మౌఢ్యము. అట్లైన దొంగయు దొంగతనమును ధర్మమని వాదింపవలసివచ్చును, తుమ్ముట, కనుఱెప్పలల్లార్చుట, ఒడలుగీరికొనుట యిట్టివి ఇతరులకు జుగుప్స బుట్టింపని మార్గమున జేసికొన్న నెవరేమియు ననబోరు. స్వానుగత చర్యల యుక్తాయుక్తవిచారణ పాడిదప్పినపని. ధర్మాధర్మములు న్యాయాన్యాయములును సంఘానుగతచర్యలయంద బ్రవర్తిల్లు.

అట్లెన నాత్మహత్య యేలకూడదందురు? ఈ ప్రశ్నకు సదుత్తరము. ఆత్మహత్యయ నిషేధ్యమయిన నానాటికిం బ్రజాసంఖ్యకు క్షీణతవాటిల్లు. సంఘము బలహీనమౌను. శత్రులతో బోరుటకు మునుపటివలె సమర్థముగా జాలదు. కావున ప్రతిమనుజునియొక్కయు