పుట:Bhaarata arthashaastramu (1958).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేక కించిద్రచితములు. అనగా నివి రచితారచితములు. రెంటి యొక్కయు లక్షణములుగలవి.

మనదేశములో పచ్చివస్తువులు దిక్కులుబుకునట్లున్నవి గాని పక్కాసరకు లంతదట్టముగాలేవు. ఇదియెంతయు జింతనీయము. రూప భేదోత్పాదకములైన కళలు విలసిల్లమింజేసి మనవస్తువుల మనమే తయారుచేసికోజాలనివారమై బయటిదేశములకుంబంపి విరచితములం జేయించి దిగుమతి చేయించుకొనుచున్నాము. పంటలతోబాటు రచనలును ఈదేశమున బ్రబలించిన భరతఖండమునకు నీడుదోడైన రాజ్యము లెవ్వియునుండవు. ఈదేశోత్పత్తిలోని విశేషము లేమనిన:- అరచితములు మెండు. విరచితములు గుండు.

ఈ విషయ మికముందు సాంతముగ జర్చింపబడును గాన నింతటితో నీ ప్రకరణము పూర్ణింతము.