పుట:Bhaarata arthashaastramu (1958).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎకరాలు నూతనముగ నుత్పత్తికివచ్చునట్లుచేసి, సేనలలో చక్కగా పనిచేసి రాజసేవజేసినవారికి వారియాశ్రితులకును విభజించి యొసంగి, వారెక్కడ నాచారప్రకార మప్పులపాలై సాహుకారులకు అడమానం పెట్టుదురో యనుశంకచే నటుచేయ స్వాతంత్ర్యమియ్యక వారి యోగ క్షేమముల నరయుటకు విచారణకర్తనొకని నేర్పఱిచి ఇంతింతనరాని మహోపకారము గావించిరి. ఆసాము, మైసూరు, కొడగు, కొచ్చి, తిరువాన్కూరు ఈ ప్రాంతములలో క్రొవ్వుకారునట్లు బలసిన భూములున్నవిగాని యవి వనావృతములౌటయు పర్వతపరిసరమ్ములం దుంట యుంజేసి మనవారు వానిపొంతకుంబోరైరి. ఇప్పుడు తెల్లజాతివా రించుమించుగ నీభుములన్నిటిని స్వాధీనముచేసికొని కాఫీ, తేయాకు, మిరియాలు, జాపత్రి, రబ్బరు ఇట్టి యనర్ఘవస్తువుల నుత్పత్తిజేసి యపారలాభంబువడయుచున్నారు. పంజాబులో జీవనదులు కాలువలు వీనిచే బోషింపబడు నేలలున్నవియని యంటిమిగదా! వానినిగూడ నింగ్లీషువారు సుమా రైదారునూఱ్లలక్షలకు గొనవలెనని చూచిరి. కాని గవర్నమెంటువారు అదికూడదని వాదించిరి. వీనిమీద గన్ను వేయుటకు గారణమేమన, ఇచ్చోట గోధుమలు కొల్లలుగ బండు చున్నవి. మనకు వరియెట్లో గోధుమలు వారికట్లు. ఇప్పటికిని బంజాబు నుండి యాదేశమునకు గోధుమలను విశేషించి ఎగుమతి జేసెదరు. అట్టిప్రదేశము తమయధీనములోనేయున్న నింకను మంచిదిగదాయని కొనజూచిరి. కావున నిదిసహజమును సకారణమునైన ఎన్నికయేయని చెప్పవలయు.

ఈదేశవైశాల్యములో సుమారు దశమభాగమింకను గన్యావస్థలోనే "నాథులెన్నడు వత్తు" రని వేచియున్నది. ఇప్పటిధరల ప్రకారము లాభకరము గాకపోయినను దినక్రమేణ భూమిలోనుండి తీయబడు వస్తువులవెలలు మేలిమిజెందుగాన ఉపేక్షతగదు. ఇవియు బరులపాలవునేమో! శీతలములైన పార్వతసీమలంగాని యూరోపి