పుట:Bhaarata arthashaastramu (1958).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలయాపనమైననేమి? పనికి మొదలుపెట్టినతోడనే దినమునకు వెయ్యి రెండువేల రూపాయల సామానుల దయారుచేయవచ్చును. కావున నుద్యమము ఘనంబగుడు నిరీక్షణకాలము నెక్కువయగును. త్వరత్వరలో లాభమువలయునన్న అల్పలాభప్రాప్తియేకాని విపులధనము నార్జింపలేము.

దీర్ఘదర్శితము దమము ధైర్యము అర్థార్జన కారణములు

చూచితిరా కాలమహిమ? విత్తము లుద్భూతంబులు కావలయునన్న వేగిరపడగూడదు. మఱి దూరపు జూపుగలవారమై దమముం బూనివుండుటఆవశ్యకంబు. దీర్ఘదర్శిత్వమును దమమును స్వప్రయోజన పరులై ఆతురతగొన్నవారి కలవడవు. "ఆత్రగానికి బుద్ధిమట్టు" అనగ వినమే! మఱియు ధైర్యము ప్రధానంబు. భవిష్యత్తు వినిర్ణీతంబుగాదు. ఎప్పు డెట్టి విఘ్నములు తటస్థములౌనో! ఎట్టి ఆలోచన పరులకును ఒకానొకప్పుడు తా మెదురుచూడని ముప్పులు వచ్చును. అట్టివేళలందు దమ సర్వస్వమును మునిగినను మునుగును. అపాయములు కలుగునని భయపడరాదు. అట్లు భయపడుట వృద్ధికి గొప్ప యర్గళము.

మృగములకు ముందు చూపులేదు. ఆకలియైనప్పుడు దినుట, తక్కినకాలముల నూఱకుండుటయు వానికి స్వాభావికములు. అట్లే మృగప్రాయులైన మనుజులును ముందు జాగ్రత్తలేనివారై కష్టములు వచ్చినపుడు "ఇట్లు చేసినబాగు, ఇక ముందు ఎంతోతెలివితో వర్తింతుము" అని యనుకొని మఱల నెప్పటియట్లు ఆ ఆలోచనముం గొల్పోయి యిడుములు గుడుతురు. పెండ్లి పేరంటములలో ముందు వెనుకలు విచారించక వెచ్చమొనరించి యప్పులపాలైన వారి నెందఱి జూచుచుండలేదు? చూడుడు! ఇంద్రియనిగ్రహ మవశ్యకర్తవ్యమని బోధించు మతము మనది. ఈ నిగ్రహము నోటిమాటలలోనేగాని