పుట:Bhaarata arthashaastramu (1958).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ఎరువులు, ఇవియన్నియు నొకేరకమైనవిగావు. ఆకెక్కి ఫలించని వానికి వేయవలసినవి గొన్ని. గింజ పెద్దయగుటకు గొన్ని, ఇట్లు వివిధములు.

4. పంటలు మార్చుట. భూమిలో ననేక ద్రవ్యము లున్నవి. ఒక్కొక్క పంటకు వీనిలో గొన్నిమాత్ర మాహారమున కుపయోగించును వరివేసితిమేని ఆ వరి తినివేయుటవలన గొన్ని ద్రవ్యములు ముక్కాలు మువ్వీసమ్ము నశించినవనుకొందము. మఱుకారునకు ఎరువువేయక మఱల వరియే చల్లిన నాధాన్యమున కాహారము చాలనందున పంట బలహీనమగును. వరిగాక రాగి చల్లితిమేని రాగులకు గావలసినవి వేరు ద్రవ్యములు గావున ఈ ద్రవ్యములు సమగ్రముగ నుంటచే పయిరు పుష్కలముగ బండును. మఱి యింకొక విశేషము. రాగి పెరుగుచుండు కాలములో వరికి గావలసిన ద్రవ్యములు ఎండ, గాలి మొదలగు ప్రకృతుల భావముచే బునరుత్పత్తి జేయబడును. రాగి కోతయైన తరువాతి కారునకు బిమ్మట వరిచల్లితిమేని నిండు పంట నెఱయును. ఈ విషయము దృష్టాంతముగా జెప్పబడినదని భావింపవలయు.

ఐరోపాలో మూడుకారుల కొకతూరి పెట్టిన పైరే పెట్టుదురు. నేలను మూడుభాగములుగజేసి అందు ఒకదాన గోధుమ, ఇంకొకదాన ఓట్సునువేసి మిగిలినదానిని దుక్కిజేసి యూరకవిడుతురు. ఈ రీతినె క్రమప్రకారము జఱుపుట పూర్వమునుండివచ్చిన శుభసంప్రదాయములలో నొకటిగా నున్నది. మనదేశములో ఎండవేడిమి ఎక్కువకాబట్టియు గ్రీష్మాంతమువఱకును నేలలు బీడుగా బడి యుండుటంబట్టియు, ఎరువు వేయుటగాని, పంటలు మార్చుటగాని యంత మిక్కుటముగజేయుట అనావశ్యకమని తోచెడిని పంటలలో వంతుబెట్టుటచే ఫలము సమృద్ధియౌననుట నిస్సందేముగా నిక్కువము. అమెరికాలో కార్నెల్ కళాశాలయందు వ్యవసాయ శాస్త్ర