Jump to content

పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  జరాసంధుఁడు - సాధుహింసోఫలము.       ti       

సని ధైర్యముతోఁ బలి కెను. వాసు దేవా ! నీనియోగంబున మాకు శత్రుజయంబగులకు సందీయము లేదు. భీమార్జును లిరు వురు నానయనంబులు. వీరినివిడిచి నేనొక్క క్షణంబును నిలువఁ జాలను. అయినను నా హృదయము మిక్కిలి హృద్యంబగు. చున్నది. కృష్ణార్జునులఁ దలంచిన వారికి శ్రీవిజయంబులగు అట్టి కృష్ణార్జునుల సహాయులు గాఁ బడసిన భీమ సేనునకు శ్రీవిజయంబులగుట కేమిసందీయము ! మహాతా ! మీకింకఁ గార్యసిద్ధియగుంగాక ! శీఘ్రంబుగఁబోయి శుభంబున మరలి రండని ధర్మజుఁ డాశీర్వదించెను.

అంతఁ గృష్ణ భీమార్జునులు యుధిష్ఠి రాను మతంబునఁ బ్రయాణసన్నద్ధులై వీర శ్రీవిభాసిత ముఖు లై గృతస్నాతకు లై బయలు దేబిరి. అట్లు బయలు దేఱిన యయ్యాదవ పాండవ వీరుల తేజోమూర్తులంగాంచి,యమనందనుఁ డమండానందము నొందెను. ఆభారతవీరులు మువ్వుకు సనేక పర్వతంబులు గడచి, తత్పర్వత జాతంబు లైన కాలకూట శోణకంటకీయంబు లను నేరుల లంఘించి, సరయూనదియుఁ బూర్వకోగలయు మిల దేశంబును గఁగ యు సతిక్రమించి, పూర్వాభిముఖులై నిరంతర ప్రయాణంబుల మగధ రాజ్యమును బ్రవేశించి గోర ఢంగా ను పర్వత మిక్కి డి. ఆపర్వతాగ్రమునుండి, చిత్రవిచిత్రం బులగు నా రామములతోడను నత్యున్నతంబులగు సౌధ రాజు ములతోడను రమ్యంబై యున్న గిరివ్రజపట్టణంబును వీక్షిం చిరి, అప్పుడన్నగర వైభనమున "కాశ్చర్యపడుచు నచ్యుతుండు