పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 11

మోహి -- (తెల్లపోయి నిలుచున్నది.)

రామా -- ఆచిన్నదాన్ని మాటలోనే యిక్కడికితలవని తలంపుగారప్పించినావు! ఈమెకు వెయ్యేళ్ళు ఆయుస్సున్నది.

కర -- (తనలో) అయ్యో! నాకొంపమునిగింది.

మోహి -- కరటకా! నన్నుక్షమించు. నేను అసమయంలో వచ్చినాను.

రామా -- అసమయంకాదు మంచిసమయంలోనే వచ్చినావు. నాభార్యవూళ్ళోలేదు, ఈరెడ్డి నిన్నురమ్మన్నది నానిమిత్తమే.

కర -- (మోహినితో రహస్యముగా) ఇతఁడే నాయజమానుఁడైన రామా కాంతముపంతులు. మనరహస్యంజాగ్రత.

రామా -- సుందరీ! నీపేరెవరు?

మోహి -- నాపేరు మోహిని. నేను మీపాదసేవకురాలను.

కర -- (రహస్యముగా) ఇతనికి పాదసేవకురాలవా? నీవు అలా అనబోకు.

మోహి -- నేను నిజముగా సేవకురాలనుకాను. గోదావరి యొడ్డున కాపురమున్న ముసలిగంగమ్మ కూతురిని.

రామా -- ముసలిగంగమ్మకూతురవా? పాపము! మొగుడు పోయినప్పటినుంచీ జీవనానికి జరగక గంగమ్మ చాలాయిబ్బంది పడుతూవున్నట్టున్నది. మీరు నిర్విచారంగా వుండండి. మీయిద్దరినీ నేనేపోషిస్తాను. నీవు మాపిల్లవాళ్ళను యెత్తుకుంటూ వుందువుగాని. నీతల్లి నీతోవుంటుంది. మీరు రేపువచ్చి మాతోటయింట్లో దిగండి కరటకా! నీవు వీరి సంరక్షణ కనుక్కుంటూవుండవలెను.

కర -- (లేచి మోహినికిని రామాకాంతము పంతులకును నడుమవచ్చి మోహినిని పొమ్మని సైగచేయుచు) మీకు పిల్లలు లేనిదీ యేపిల్లల నెత్తుకొంటుంది?