పుట:AntuVyadhulu.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

231

చక్కగ స్నానము చేయు వారి శరీరము మీద నిది పడిన యెడల ఇది లోపల ప్రవేశింపక మునుపే మరియొక చోటు వెదకి కొనవలసి వచ్చును.

నివారించు పద్దతులు

స్నానము చేయునప్పుడు రోగులు ఉపయోగించిన బట్టలను ఇతరులు ఉపయోగింప రాదు. రోగి కట్టుకొను బట్టలను చక్కగ ఉడక బెట్టి ఎండ వేయవలెను. లేని యెడల తన వ్యాధి తకనే ఒక చోట నుండి మరియొ చోటి కంటుకొను చుండును. ఒక ఇంటిలో అనేక మందికీ వ్యాధి అంటి యున్నపుడు అందరకు ఒక్కటే సారి వైద్యము చేయ వలెను. లేని యెడల వీరిని విడిచి వారికి, వారిని విడిచి వీరికి అంటు కొనుచు ఎన్ని దినములు వైద్యము చేసినను వ్యాధి ఆ ఇంటిని విడువక పోవచ్చును. సంపర్కము గల వారలెల్లరు శరీరముల మిక్కిలి శుభ్రముగ తోము కొనుచు దినదినము స్నానము చేయ వలెను.

సమాప్తము

ఇంత వరకు మాకు ముఖ్యమని తోచిన కొన్ని అంటు వ్వాధుల వ్వాపకమును గూర్చియు వాని వ్వాపకమును నివారించు మార్గమును గూర్చియు మాశక్తి కొలది సులభ మైన మాటలతో చర్చించియుంటిమి. ఈ గ్రంధము వైద్యుల కొరకు గాని వైద్యులు కాబోవు వారి కొరకు గాని వ్రాసినది కాదు. దీనిని ముఖ్యముగ ప్రజల కొరకై వ్రాసియుంటిమి ఇందు అనేక వ్యాధులు