పుట:AntuVyadhulu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

అపరిశుద్ధమైన సంయోగము చేతనే కలుగును గాని తానంతట తాను రాదు. ఈ పుండునకును కొరుకు వ్యాధి కలిగించు పుండు నకును గల భేదమును తెలిసి కొన నగును.

అడ్డగర్రపుండు

1. సంయోగమయిన కొన్ని గంటలు మొదలు కొద్ది దినములలో బయలు పడును.

2. మెత్తగ నుండిన వెంటనే చీము పట్టి గొయ్యి వలె నుండు పుండుగా ఏర్పడును.

3. ఒక పుండు లోని చీము మరియొక చోట నంటి నప్పుడు అక్కడ మరియొక పుండు ఏర్పడును. కావున అనేక పుండ్లు ఒకటే సారి అంగము మీద నున్న యెడల ఆపుండు అడ్డ గర్రలు పుట్టించు పుండని చెప్పవచ్చును.

4. ఈ పుండు విషము గజ్జల లోనికి ఎక్కి అక్కడ బిళ్లలు ఉబ్బి చీము పట్టి అడ్డగర్రలుగా ఏర్పడును.

కొరుకుపుండు

1. సంయోగమైన కొద్ది దినముల వరకు గాని బయల్పడదు.

2. మొట్టమొదట నొక పొక్కుగ యబలు దేరి ఆనప గింజ వలె గట్టిగ నుండి దిమ్మగా నేర్పడి ఒకానొకప్పుడు చీము పట్టకనే కరిగి పోవును. ఒకానొకప్పుడు దీని మీదగాని, చుట్టు ప్రక్కల గాని అడ్డగర్ర పుండు కూడ అంటి యున్న యెడల వ్యాధి ఏది? అయినదియు తెలిసి కొనుట కష్టము.