పుట:AntuVyadhulu.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

యు సందర్భములు కలుగ కుంటుటకు గాను ఆటలమ్మను గూడ ప్రకటన చేయు వ్యాధులలో చేర్చిన యెడల అధికారులు వచ్చి చూచుకొని అవసరమైన యెడల రోగిని ప్రత్యేక పరచి తగు జాగ్రత్తను పుచ్చుకొందురు. ఒక ఇంటిలో ఒక పిల్ల వానికి వచ్చిన ఆటలమ్మ ఇతర పిల్లలకు రాకుండ చేసికొన వలయు నన్న యెడల రోగిని ప్రత్యేక పరుచుటకు గూర్చియు శుద్ధి చేయుటను గూర్చియు పండ్రెండు పదమూడు ప్రకరణములలో వివరింప బడిన విషయమును చూడుము.

గవదలు

సామాన్యముగా పిల్లలకు మెడయొక్క పైభాగమున క్రింద దౌడ ఎముకకు లోతట్టునను చెవి సమీపనునను ఉబ్బి బిళ్ళలు కట్టి నొప్పి ఎత్తు ఒకానొక అంటు వ్యాధికి గవదలని పేరు. దీనికి గాలి బిళ్ళలనియు చెప్పుదురు. ఒక ఒకటి రెండు రోజులు వ్వత్యాసములో రెండు పైవులను వచ్చు స్వభావముకల దగుట చే వ్యాధిని గుర్తెరుగుట కంతగా కష్టముండదు. సామాన్యముగా గవదలు ఉబ్బక ముందే కొంచెము జ్యరము తలనొప్పి మొదలగు లక్షణములు కనిపించును.

వ్యాపించు విధము

ఈ వ్యాధి తరుచుగా నాలుగు సంవత్సరములు మొదలు పదునాలుగు సంవత్సరముల వయస్సుగల పిల్లలకు అంటును. కాని పశిబిడ్డలకు ముసలి వాండ్లకును తప్ప తక్కిన వారల