పుట:AntuVyadhulu.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

191

ఆస్పత్రిలో నుండు ఏ విధమైన సామానును బయటికి పోనీయ రాదు. రోగులు వ్రాయు ఉత్తరములను బహుశ్రద్ధగ ఎండబెట్టిగాని కాచి గాని శుద్ధి చేసి బయటికి గాని బయటకు పోనీయ వలెను.

ఆస్పత్రి విషయమై చెప్పిన నిబంధనలన్నియు ఇండ్లలో నుండు రోగుల విషయములో కూడ భహు జాగ్రత్తగా జరుపు చుండిన యడల ఈ వ్యాధి యొక్క వ్యాపకము ఇప్పటి కంటె అనేక రెట్లు తగ్గి పోవునని చెప్పవచ్చును.

తట్టమ్మవారు (పొంగు)

ఇది గొంతు నొప్పి, జలుబు, కొద్ది పాటి దగ్గు, మొదలగు లక్షణములు కలిగి శరీరమంతయు ఒకానొక విధమైన తట్టు వలె నుండు దద్దులతో కూడిన యొక విధమైన జ్వరమని చెప్పవచ్చును. కొందరికి ఈ వ్యాధితో పాటు కండ్ల కలక గూడ రావచ్చును.

వ్యాపకము

ఇది ప్రపంచకము నందన్ని భాగముల యందును కొద్దిగనో హెచ్చుగనో వ్యాపించి యున్నది. అప్పుడప్పుడు ఈ వ్యాధి వచ్చుచు పోవు చుండును దేశములలో కంటె దీని నెన్న డెరుగని దేశములో నిది ప్రవేశించిన యెడల మిక్కిలి ఉపద్రవము కలుగ చేయును. 1875 సంవత్సరములో ఫీజీ ద్వీపములలో ఇది ప్రవేశించి నపుడు దీని వ్యాపకము తీవ్రమై మూడు నెలలలో దేశమందలి ప్రజలలో నాలుగవ వంతును మ్రింగి వేసినది.