పుట:AntuVyadhulu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

169

(4)గాలి: కలరా రోగి ప్రక్కన కూర్చున్నంత మాత్రమున గాలి మూలమున ఒకరి నుండి మరియొకరికి ఈ వ్యాధి అంటదని ప్రస్తుతం అనేక వైద్యుల అభిప్రాయము. కాని కొందరు వైధ్యులు కొన్ని నిదర్శనములను కనుబరచి మిక్కిలి అరుదుగ గాలి మూలమున కూడ అంట వచ్చునని వాదించు చున్నారు. తగినంత జాగ్రత్తగ చేతులను దుస్తులను, 12, 13 వ. ప్రకరణములలో చెప్పిన ప్రకారము శుద్ధి చేసికొనిన వారికిని కలరా ఆస్పత్రులలో పని చేయు పరిచారికలకును వైధ్యులకును ఈ దేశమునందు కలరా వచ్చు చున్నట్లు లేదు. కావున ఇంకను ఈ విషయము చర్చింప దగియున్నది.

(5) మానవ స్వభావము: ఒక సంఘములో కలరా వచ్చి నపుడు కూడ అందరికి ఈ వ్యాధి ఒక్క రీతిగా నుండుట లేదు. ఒక సంవత్సరము ఒక గ్రామములో ముమ్మరముగ కలరా వచ్చి పోయిన పిమ్మట ఆ ఊరి వారలను తిరిగి మూడు నాలుగు సంవత్సరముల వరకకు ఇది అంత తొందర పెట్టు చున్నట్లు కాన రాదు. ఎనిమిదవ ప్రకరణములో చెప్పిన ప్రకారము వార్ల కొక విధమైన రక్షణ శక్తి గలుగు నేమో తెలియదు. సామాన్య సంపర్కమేదియు వేరుగ లేని యెడల సాధరణముగా నొక ఊరిలో వుండు ప్రజలలో పల్లపు వీదులలో నున్న వారలకు మెరక వీధులలో వున్న వార్ల కంటె వ్వాధి వ్వాపకము హెచ్చుగ నుండు నని తోచుచున్నది. స్త్రీ పురుష వివక్షత గాని వయో వివక్షత గాని ఈ వ్యాధికి ఉన్నట్లు తోచదు. భాగ్య వంతులలో కంటె బీద వారిలో ఈ వ్యాధి హెచ్చుగ ఉండుననుట నిశ్చయము.