పుట:Andhrula Charitramu Part 2.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతకాలము గడచునప్పటికి బిజ్జలునికిని బసవేశ్వరునికిని విరోధము బలమయ్యెను. బిజ్జలుడు బసవేశ్వరుని బట్టి చెరబెట్ట బ్రయత్నించెను. దీనిని దెలిసికొని బసవేశ్వరుడు తన యనుచరులతో దప్పించుకొని పోయెను. బిజ్జలుడు కొందరు భటులనతని వెంటబంపెను. బసవేశ్వరుడు వారలను దరిమెను. అంతట రాజు స్వయముగా సైన్యమును దీసికొని బసవేశ్వరుని వెంట దరిమెను. వీరశైవులనేకులు బసవేశ్వరుని పక్షమున నిలిచి ఘోరయుద్ధము చేసి రాజు సైన్యమునోడించిరి. తరువాత రాజు బసవేశ్వరునితో సమాధానము చేసికొని యథాప్రకారమతనిని పూర్వ పదవియందుంచెను. [1]కాన యీ మైత్రి చిరకాలము నిలిచియుండలేదు.

బిజ్జలరాయని వధ.

బిజ్జలుడు బ్రతికియున్నంత వరకుదన మత మభివృద్ధి గాంచనేరదని బసవేశ్వరుడు తలపోయుచుండెను. కళ్యాణపురమున బసవేశ్వరునికి బ్రియభక్తులగు నిరువురు శైవులుగలరు. బిజ్జలుడు తన మతస్థులయిన జైనులను ఆ యిరువురు దూషించెడు దూషణవాక్యములకు సహింపనోపక వారి కన్నులనూడబెరికించెను. ఈ ఘోరకృత్యమును బసవేశ్వరుని శిష్యులయిన వీరశైవులందరును విని, బిజ్జలునిపై బగదీర్చుకొను తలంపుతో బసవేశ్వరుని యింట సమావేశమై నిర్ధారణ చేసికొనిరి. అంతట బసవేశ్వరుడు బిజ్జలుని జంపుటకై జగద్దేవునకుత్తరువుచేసి, కళ్యాణపురిని శపించుచు నా పట్టణమును విడిచిపెట్టిపోయెను. జగద్దేవుడీ క్రూరసంహారమునకు మొదట కొంత సంశయించెను గాని, తల్లి ప్రోత్సహించుటచే ధైర్యసాహసములు ముప్పిరిగొన దన మిత్త్రులగు మల్లయ్య, బొమ్మయ్యయను వీరశైవులనిరువురను దోడుచేసికొనగా, వీరావేశము మొలకెత్త దిన్నగా నీ మువ్వురునంతఃపురమునకు జని, రాజపరివారమును ద్రోచికొనిపోయి బిజ్జలునిసమీపించి మహో

  1. Jour. R.A.S., Vol.IV., p.21; Jour. B.B.R.A.S., Vol.VIII., p.89.