పుట:Andhrula Charitramu Part 2.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు త్రైలోక్యమల్లునియొక్క యుద్ధమంత్రిగను, దండనాయకుడుగను ఉండెను. ఇతని ప్రయత్నమునకు కొల్లాపుర మహామండలేశ్వరుడగు విజయార్కుడును, మహామండలేశ్వరుడును త్రైలింగ్యసామ్రాజ్యస్థాపకుడునగు కాకతీయప్రోల్రాజును, దోడ్పడి, ఇతనికి విజయమును సిద్ధింపజేసిరి. కాకతీయప్రోల్రాజు త్రైలోక్యమల్లుని ఓడించి యతని చెరపట్టి 1157వ సంవత్సరమున విడిచిపుచ్చెను. త్రైలోక్యమల్లుడు కళ్యాణపురమును విడిచిపెట్టి ధార్వాడమండలములోని యన్నిగేరికి బోయి కొంతకాలము వరకు దానినే రాజధానిగ జేసికొనియెను గాని, యాతని రాజ్యము మిక్కిలి క్షీణించినదయ్యెను. క్రీ.శ.1153వ సంవత్సరమున బిజ్జలుడు రాజ్యభారమును వహించినట్టు దెలుపు శాసనమొకటి కలదు గాని, శాలివాహనశకము 1084 (క్రీ.శ.1162) వరకు రాజబిరుదము లేవియును వహింపక మహామండలేశ్వరుండుగనే యున్నట్లు కన్పట్టుచున్నది. ఇతడాసంవత్సరమున త్రైలోక్యమల్లునిపై దండెత్తిపోయి తాను స్వతంత్రరాజని ప్రకటించెను. త్రైలోక్యమల్లుడను రెండవ తైలప్పదేవుడు అన్నిగేరి నుండి మరికొంత దక్షిణముగా వనవాసికిబోయి యచ్చటనే నివసించుచుండెను.[1] ఇతడు క్రీ.శ.1166వ సంవత్సరమువరకు బరిపాలనము చేసినట్లుగ గానిపించుచున్నది.[2]

కాలచుర్యులు.

ఈ కాలచుర్యులు హైహయాన్వయులు. కార్తవీర్యార్జునుని సంతతివారమని చెప్పుకొను నొక తెగ రాజులు. వీరు చేది దేశమును బరిపాలించుచుండిన యొక రాజకుటుంబము వారు. కళ్యాణపురమును స్వాధీనము చేసికొన్న తైలపదేవుని తరుమగొట్టిన బిజ్జలుడీ రాజకుటుంబములోనివాడే. హైహయాన్వయులయిన యీ చేదిరాజులు కాలంజరపుర వరాధీశ్వరులమని బిరుద

  1. Jour R.A.S.Vol.IV., p.16
  2. P.S&O.C.Ins. No. 140.