పుట:Andhrula Charitramu Part 2.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రులు మహమ్మదీయుల నోడించుట

       గ్యాస్ ఉద్దీన్ తుఘ్లఖ్ ఢిల్లీనగరమున పట్టాభిషిక్తుడైన వెనుక మంగోలియా జాతివా రయిన మోగలులవలననే యుపద్రవము గలుగకుండ సరిహద్దుప్రాంతముల సైన్యములను నిలిపి చక్కనికట్టబాటుల నేర్పఱచి తన దృష్టినంతయు దక్షిణాపధము వంకకు ద్రిప్పెను. తనకు బ్రక్కలో బల్లెముగా నుండిన ప్రతాపరుద్రుచక్రవర్తియొక్క ప్రాక్రమమును గూర్చినకధలు ఢిల్లీ చక్రవర్తికి వినవచ్చుచుండెను. ఎందఱెందఱో రాజు లా యాంధ్రచక్రవర్తియెడ నసూయామాత్సర్యగ్రస్తులై యున్నారని గూడ నాతడు దెలిసికొనియెను. ప్రతాపరుద్రుని యాస్థానమున నుందు సేనాపతులలో పద్మనాయకులకును దక్కిన శాఖలవారలకును వైషమ్యములు వెలసియున్నవనియు నిది దండయాత్రకు ననుకూలముసమయ మనియు నేకశిలానగరమునుండియు, దేవగిరినుండియు ప్రతాపరుద్రుని శత్రువులవలన సమాచారము లంపబడెనని కూడ వదంతులు గలవు. ఇంతకన్న మంచిసమయము దొరకదని ఢిల్లీచక్రవర్తి క్రీ.శ. 1344 వ సంవత్సరమున తన జ్యేష్టకుమారు డైన ఆలూఫ్ ఖానుని బదివేల గుఱ్ఱపుదళమును లక్షకాల్బలమునిచ్చి యాంద్రదేశము మీదికి బంపెను. ఈ;యలూఫ్ ఖానునియొక్క నిజమైన నామము మలిక్ ఫకీరుద్దీన్ జానా యని, ఈ దండయాత్రలో ఆలూఫ్ ఖానుని వెంబడించి వచ్చిన సైన్యములు చెందేరి, బుదాపూర్, మాల్వాయను ప్రదేశములం బ్రసిల్ద్దికెక్కిన వైయున్నవి.  ఇట్టి బ్రసిద్ది గాంచిన సైన్యముతోడ శత్రుదేశెముల గొల్లగొనుచు నాంధ్రదేశమున బ్రవేశించినతోడనే ప్రతాపరుద్రచక్రవర్తి యించుకయు జలింపక యాంధ్రసామ్రాజ్యమున మిక్కిలి పేరుమోసిన సేనాపతుల నెదుర్కొన బంపెను. అప్పు డుభయపక్షములవారికిని ఘోరసంగ్రామము బాలఢ్యమైనదియు నధిక సంఖ్య కలదియు నగుటచేత తుట్టతుదకు నాంధ్రులు బట్ట