పుట:Andhrula Charitramu Part 2.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమాసులము గదా; మనము నేటిదినము జీవించియున్నను రేపటిదినము మరణం నొందవలసివారమె; మన మందఱము నొక్క సారిగ బ్రాణములు ద్యజింతమ్; ఓబ్రాహ్మణులారా! మీరు మాగ్రంధములతొ బాటు దగ్ధము చేయక నిలిపుకొన్న మా యమరకోశము దక్క తక్కిన మీవేదశాస్త్ర గ్రంధములు తొంటి ప్రఖ్యాతిని విడిచి నిరుపయోగములై పొవును గాక! మాబూములలో నెవ్వరు నివసింతురో వారలకు జయము కలుగనుందును గాక! అన్యాయముగా బ్రాహ్మణులను గెలిపించుటకై మాయతంత్రములు గావించిన మంత్రవాదులును వారి సంతతివారుని బిచ్చగండ్రై తిరిపమెత్తుకొని బ్రదుకుదురు గాక! (వీరె విప్రవినోచులనంబడుతారు) చక్రవర్తికి సరి యైన విమర్శచేసి సత్యమును గ్రహింపజాలక బ్రాహ్మణులు కల్పించిన మాయలో జిక్కుకొని వారల కనుకూలు డై మానాశనమునకు గారకుడయ్యెను గావున నీతడు శీఘ్రకాలములొనే పరరాష్ట్రాధి పతిచేత జెఱగొనంబడు గాక! అంతటితో నీతనిసామ్రాజ్యము భగ్న మగును గాక!

  అని శపించి యనేకులు ప్రాణత్యాగం చేసికొని రట! ప్రాణత్యాగము చేయ నొల్లని మతాచార్యులనేకులు విష్ణుభక్తిపరాయనులై వైష్ణవాచార్యులైరి. తరువాత వీరలు ప్రతాపరుద్రునకు గర్భశత్రువులుగ నుండి యత్కలరాజుతో గుట్రలు గావించి ఢిలీ చక్రవర్తులగు తురుష్కులను దాడి వెడలి వచ్చునట్లుగ చేసి కాకతియాంధ్రసామ్రా జ్యమును భగ్నముగ జేయు కార్యమునం దోడ్పడిన వారైరి. ప్రతాపరుద్రచక్రవర్తి యెంతటి సమర్ధుడైనను జైనులకు గావించిన యుపకృతివలన దాను శత్రువులచే జిక్కి పరిభవము నొందుటయు సామ్రాజ్యమును గోలుపోవుటయు సంభవించెను. ఇంటిగుట్టు లంకకు జేటని తనరాజ్యములో మిత్త్తరూపమున నున్న యీ జైనశాత్ర వులే పరరాష్ట్రాధిపతు లయిన తురుష్కులకు రాజ్యంర్మములను దెలిపి తనదేశమునకు రాజ్యమునకు మహాపకారమును గావించిరి. ప్రతాప