పుట:Andhrula Charitramu Part 2.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శా.శ.1231 (క్రీ.శ.1309) సౌమ్యసంవత్సర ఫాల్గుణ శు.7 గురువారమున తలకంటిదేవి గర్బాలయ్లమునకు ఉత్తరభాగమున శిలాశాసనము వ్రాయించి రని జమ్మలమడుగు స్థానిక చరిత్రమువలన దెలియుచున్నది.

శైవమతప్రాబల్యము-జైనమతనిర్మూలనము.

   తనమాతామహితండ్రి యగు గణపతిదేవచక్రవర్తివలెనే ప్రతాపరుద్రుడు శైవ్మాభిమానిరతి గలవా డగుటం జేసి శైవమతగురువు లనేకు లాంధ్రదేశమునకు రాదొడంగిరి. శైవమతములు పెక్కులు గలవు.  వానిలొ శ్రీశైలము, పుష్పగిరి, కొసంగి, కోటిఫలిమతములు ప్రధానములు. ఆంధ్రదేశంబున దక్షారామము త్రిపురాంతకములు ప్రధానములు.  ఆంధ్రదేశంబున దక్షారామము త్రిపురాంతకము మొదలగు శైవక్షెత్రము లయిన పుణ్యక్షేత్రము లనేకము లున్నను శ్రీశైలము పురాతనకాలమునుండి ప్రధానక్షేత్రముగా నుండెను. జన్మమెత్తినందుకు కొక్కసారి యైనను శ్రీశైల మల్లిఖార్జునదేవుని సందర్శింపకున్న ముక్తి కలుగ నేరదని యాకాలపు శైవులు విశ్వాసమై యుండెను.  మండలేశ్వరు లయిన మహారాజులకు సామంత నృపగులక్కుగురువు లారాధ్యబ్రాహ్మనులును శివయోగు లయిన బ్రహ్మచారులును; మంత్య్రులు లింగధారు లయిన నియోగిబ్రాహ్మణులు; మహావీరు లయిన సేనాధిపతులు మొదలగువారికి గురువులు జంగమదేవరలు. ఈవీరశైవులకు వీరకర్తేయము నందుగూడ నభిరతి మెండుగ నుండెను.  ఇంక మైలారు వీరభటులం గూర్చి చెప్పనేల? వీరశవభక్త్యావేశపరవశులై యున్నప్పుడు శివుడు పమధగణములతో గూడి తమతో నృత్యము సలుపు చుండె నని భావించి భయంకరనృత్యములను చేయుటకు వెనుదీయకుండిరి. ఏకశిలానగరవీధులలో విహరించుచు మైలారదేవుని యుత్సవమునాడు మైలారవీరభటులు చేయు వీరకృత్యములను జూచి వర్ణించినవిధమును వల్లభామాత్యుడు తనక్రీడాభిరామములో నీక్రిదిపద్యములలో జూపియున్నాడు.