పుట:Andhrula Charitramu Part 2.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మున దండ్రియు సోదరులును రామాయణమును సలక్షణముగా భాషాంత రీకరించియుండ నీవిధముగా నిందఱచేత రామాయణమును వ్రాయించి తాను కృతికానాయకుం డగునా యని యొకగొప్పశంక కలుగక మానదు. కృతినాయ కుని వంశ మైనను భాస్కరరామాయణమున వర్ణింపబడియుండలేదు.

   మల్లికార్జునభట్టు కాండాంతగద్యములలో "శ్రీమదష్టభాషాకవిమిత్త్ర కులపవిత్ర భాస్కరరసత్కవిఉత్త్ర మల్లికార్జునభట్ట ప్రణీతం" బని వ్రాసికొనియుండుటచేత నతదు కుమారయసాహిణియాస్థానకవియగు భాస్కరునిపుత్త్రుడని యుబయ పక్షములవారును జెప్పుచున్నారు.
   ఇతడు సాహిణిమరునియాస్థానకవి యల్గ్లు భస్కరుని పుత్త్రుడేయైన వారి యాజ్ఞప్రకారము రామాయణమ్ను రచింప బూనినవాడేయైనా యెడల బాలకాండము మొదట కృతినాయకుని సంబోధింపక కాండంతమున శివును సంబోధించి ప్రభువుయొక్కయు, తండ్రియొక్కయు నాజ్ఞల నుల్లంఘించునా? కిష్కింధాకాండాది నున్న పద్యము సాహిణిమారుని గూర్చిన సంబోధనము కలది కాదు. కాండాంతరమునందలి పద్యములు రెంటిలో నొకటి సాహిణిమారుని గూర్చిన సంబోధనము గలదియు, మఱియెకటి శివుని గూర్చిన సంబోధనము గలదియు నైయున్నది.  సుందరకాండం మొదట సాహిణిమారుని సంబోధించుచున్న పద్యము గలదు గాని కాండాంతమునందలి పద్యములు రెండును శివుని సంబోధించునవిగా నున్నవి. కాబట్టి మల్లికార్జునభట్టు రచించిన భాగములు శివుని కంకితము చేయబదినవి గాని సాహినిమారుని కంకితము చేయబడినది కావనియు, సాహిణిమారుని గూర్చిన రెండుపద్యముల నెవ్వరో చాటువులుగా జెప్పిన నిటీవలిలేఖకలు వానినిదెచ్చి వీనికి ముడిపెట్టి రనియు, మల్లికార్జునభట్టు సాహిణిమరునికాలమువాడు కాడనియు నూహింపవలసి వచ్చుచున్నది.