పుట:Andhrula Charitramu Part 2.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప దు మూ డ వ ప్ర క ర ణ ము

శ్రీవీరప్రతాపరుద్ర దేవచక్రవర్తి పాలనము.

                          --

(క్రీ.శ. 1895 మొదలుకొని క్రీ.శ. 132 1 వఱకు)

    ఇట్లు పదుమూడవశతాబ్ధము నంతమున రుద్రదేవికి దౌహిత్రుడును నత్త కుమారుడైన శ్రీకాకతివీరప్రతాపరుద్రదేవ మహారాజు త్రైలింగ్య సామ్రాజ్యభారమును  వహించి అధ్యాసిత వజ్రసింహాసనుండై శిష్టరక్షణమును దుష్టశిక్షణమును గావింపుచు ప్రజాపరిపాలనము చేయు నారంభించెను. ఇతడు యౌనవంతుడైన  వెనుక రుద్రదేవికాలమున దేశమునకు బాధ కలిగించు చుండిన సామంత నృపతులను జయించి యాంధ్రసామ్రాజ్యము దినక్రమ ప్రవర్ధమానమై వెలుంగు నట్లు ప్రయత్నించి సఫలీకృత మనోరధు డయ్యెను.  ఆంధ్రభాషను మాటలాడిన ప్రజలనెల్ల నేకచ్చత్రము క్రిందికి గొనివచ్చెను. ఈ రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలమున నాంధ్రసామ్రాజ్యము నవలక్ష సమర్ధులతో మెప్పుచుండెను.

ఏకశిలానగరము.

   ఆకాలమున నుత్తరహిందూదేశంబునం దురుష్కులకు రాజధానీనగరమై ప్రసిద్ధి వహించియున్న ఢిల్లీ నగరమునకన్న నైశ్వర్యప్రభావమున మిన్నమై దక్షిణహిందూస్థానంబునం గల పురంబులలో నెల్ల మేటి యై, శత్రుజన