పుట:Andhrula Charitramu Part 2.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుడు మొదలుగా గలబిరుదము లనేకములు గలవు. ఇతడు శా.శ.1182 రౌద్రిసంవత్సర చిత్ర శు 11 గురువారమునాడు పొత్తపినాటిసీమలో బాహునదికి దక్షైణభాగమున నున్న పురందలూ రనియెడు పొన్ందలూరు గ్రామమున శ్రీపర్వతామల బ్నసవగొళకమఠమునకు సంబంధించిన నిజగురుశాంతపూర్వ శివదేశికులకు బ్రాహ్మణాతిధ్యభ్యాగతపూజార్ధము సమర్పణము చేసినట్లుగ పొందలూరు గ్రామమలోని యీశ్వర దేవాలయంలో రంగమండపమున కెదుట నున్న ఱాతిపైగల శాసనమువలన దెలిఉచున్నది. జన్నిగదేవమహారాజు పరిపాలనకాలములొ పల్నాటిసీమలోని కారెముపూడీగ్రామమున బ్రతిష్టచేయ బడిన సురేశ్వరాలయమునకు బ్రాకారములును గోపురమును నిర్మింపబడినది. నామయ యనుకరణముచే దిర్గిలేక దుర్గిపట్టణమున గోపీనాధుని యాలయము శా.శ.1191 అనగా క్రీ.శ.1862 వ సంవత్సరమున గట్టబడినది. ఈ సంవత్సరము నకు తరువాత నీతనినామము మఱిఎచ్చటను వినంబడనందున నీతడు క్రీ.శ.1270 వఱకుమాత్రము జీవించెనని యూహింపదగినది.

త్రిపురాంతక దేవమహారాజు

     కాయస్థకులార్ణవచంద్రులయిన గంగయసాహిణియు అతని మేనల్లుడైన దన్నిగదేవ సాహిణియు స్వర్గస్థు లయిన పిమ్మట త్రిపురాంతక దేవమహారాజు రుద్రమదేవికి బ్రధానియు సైన్యాధ్హ్యక్షుడునై కమ్మనాడు, మలికినాడు, పొత్తపినాడు ఏరువనాడు, గండికోట మొదలగు సీమలకు నధికారియైన ప్రతినిధిపాలకుండై పరిపాలించి వాసికెక్కెను. మఱియు నితడు తన శాసనములళో "శ్రీమన్మహామండలేశ్వర బాహత్తరనియోగాధిపతి, అనేక దేశాధిపతిచతుర్వర్ణ్య సముద్ధరణ, పశ్చిమరాయదామోదర దిశాపట్ట,ఏకాంగవీర, వీరావతార, అతివిషమహాయారూఢ ప్రౌఢరేఖారేనంత, విజయలక్షీ కాంతనాయక, నారాయణ, కదనప్రచండస్తంభ స్తంభితసకలక్షితపాల శౌర్యయశస్తోమతిలకితదిగంగ నాముఖ, వితరణ గణవినిర్జిత కామధేను కల్పద్రుమ