పుట:Andhrula Charitramu Part 2.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరుద్రమదేవిపరిపాలన చరిత్రము.

(క్రీ.శ. 1261 మొదలుకొని క్ర్రీ.శ. 1295)

రుద్రాంబ గణపతికూతురు గాని భార్యకాదు.

   కాకతి గణపతిదేవ చక్రవర్తి కీర్తిశేషుడై చన్నవెనుక నతనిపుత్త్రికా రత్నము శ్రీరుద్రమదేవి వజ్రసింహాసనము నధిష్టించి యాంధ్రసామ్రాజ్యప్రిపాలనభారము వహించెను.  పూర్వగ్రంధములలోనుగూడ రుద్రాంబ గణపతిదేవచక్రవర్తిభార్య యని వక్కాణీంపబడి యుండుటం జేసి యాంధ్రప్రపంచ మట్లే యవిచారపూర్వ కముగా విశ్వసించి యున్నది కాని నిక్కము విచారింప నామె యాతనికొమార్త గాని భార్యకాదని విస్పష్టము కాగలదు. రుద్రాంబాదేవి గణపతిపుత్రిక యై యుండగా భార్య యని వాదుకలోనికి వచ్చి విశ్వసింపబడుటకు హేతువు వేమో యెంతమాత్రమును బోధప కున్నది.  రుద్రమదేవి పరిపాలనము చేయుచున కాలమున హిందూదేశమును జూడవచ్చిన "మార్కోపోలో" అను వెనీసు వర్తకు డొకరు"కాకతి గనపతి యనంతర మతనిభార్య రుద్రమదేవియతని కంటెను మిక్కిలి వైభవముతో రాజ్యము చేయుచ్;ఉన్నది." అని నుడివి యున్నాడు.  విదేశీయుడగుట జేసి యితడట్లు వ్రాసియుండునని యూహింతమన్నను, స్థానిక వృత్తాంతములలో సయితము భార్య యనియే చెప్పబడినది  స్థానికచరిత్రములొని విషయము లన్నియు పరమసత్యములను గా మనమెంతమాత్రమును భావింపరారు. అయ్యని యవిమర్శపూర్వకముగా బ్రజ