పుట:Andhrula Charitramu Part 2.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వావసునామ సంవత్సర పుష్యశుద్ధషష్టి కుజ వాసరంబున మకరసంక్రాంతి నిమిత్తమున గాకతి గణపతిదేవ మహారాజునకు ధర్మముగా త్రిపురాంతక దేవున కంగరంగభోగములకై నడిపింపబడుచున్న త్రిపురాంతక గ్రామములో కుంకము లేకుండ మున్నూరు నివేశములకు పెఱుకవాండ్రెకు దానము చేసెనని మాత్రము త్రిపురంతక శాసనములలో నొకదానినిబట్టి దెలియుచున్నది.

మేచయ నాయకుండు.

    ఈ మేచయనాయకుడు గణపతిదేవ చక్రవర్తి కాలమున నేకశిలా నగరపాలకుండును అతని కనుంగుదలనరియు పై యెప్పుచుండె నని, సూరన కఫ్వికృతమైన మార్కండెయ పురాణముయొక్క యవతారికలో నీక్రింది సీస పద్యములో జెప్పబడియున్నది.

     "సీ. ఏరాజు రాజుల నెల్ల జయించి ము
                  న్వెట్టికి బట్టే దోర్విక్రమమున
            నేరాజు సేతునీహోదాద్రి మధ్యోర్వ
                 నేకపట్టణలీల నేలి వ్రాలె
           నేరాజు నిజకీర్తి నెనిమిది దశల ను
                ల్లాసంబు నొంద నలంకరించె
           నెరాజు తన తేజమీజగంబునకు న
                ఖండైకవిభనంబుగా మొనర్చి
          నట్టి కాకతి గణపతిక్ష్యాధినాధు
                ననుగం దలవరి ధర్మాత్ముడధిక పుణ్యు
         డయిన మేచయ నాయకు ప్రియతనూజ
                నతులశుభలక్షణ స్ఫురితాదులాంగి."
            

        ఈ మెచయ నాయకుని కొమార్తెయైన మల్లమాంబికన్ మల్లచమూ వల్లభుని కుమారు డగు నాగానిధినీశ్వరుండు వివాహము జేసికొనియెను. రుద్రదేవిం గూర్చి వ్రాయుప్రకరణమున నీనాగయ చరిత్రము వివరింతును./