పుట:Andhrula Charitramu Part 2.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మును ధారాపూర్వముగ దత్తముగావించెను. మఱియును మైదకూరుపట్టణము న శకవర్షము 1181 సిద్ధార్ధిసంవత్సర పుష్య 11 మకరసంక్రాంతిపుణ్యకాలమున బ్రాహ్మణులకు 68 వృత్తులు గల శ్రోత్రియాగ్రహారమును జేసిధాతు పూర్వకముగ దత్తము గావించెను. ఇంతియగాక త్రిపురాంతకములోని శ్రీమూలదేవస్థాన దేవునికి బోయపల్లి రెడ్దపల్లి గ్రామములలో భూదానములను చేసెబ్య్,

జన్నిగదేవ సిద్ధయదేవుల యుద్ధము.

    గంగయసాహిణి ములికినాటి దేశమును బరిపాలనము చేయుచున్న కాలమున గాంచీపురమునుంది భీమనుదేవ మహారాజు కుమారుడు సిద్ధయ దేవహారాజు ములికినాటిని జయించి స్వాధీనపఱచుకొన వలయూనని దండెత్తి వచ్చి పట్టపురావి గ్రామమ్నకు బూర్వభాగమునందు రెండుపర్వుల దూరమున బినాకినీనదికి నుత్తరభాగమున నున్న్ సొమశిల పట్టణము కడ దండు దిగి యుండగా గంగయసాహిణితో బుట్టువుకుమారుడైన ముగారి నారాయణ చలమ ర్త్రిగండ గండ పెండేర జన్నిగదేవమహారాజు సైన్యమును గూర్చుకొని వచ్చి గంగయసాహిణి పక్షమున సిద్ధయదేవుని సేనల నెదుర్కొని ఘోరయుద్ధము చేసెను. ఒకటి రెండు  సారులు సిద్దయదేవ మహారాజునకే జయము కలుగుటయు, సిద్ధయదేవుడు వీరమరణము నొందుటయు దటస్థించెను. గణపతి దేవచక్రవర్తికిని గంగయసాహిణికిని బిమ్మట జన్నిగదేవమహరాజు కాకతీయ రుద్రదేవునికి సైన్యధ్యక్షుడయ్యెను.

గణపతిదేవచక్రవర్తి జైనబౌద్ధులను జంపించుట.

  పండ్రెండవ శతాబ్దమున వీరశైవమతము త్రిలింగదేశమున బ్రవర్ధమానమై వ్యాపించుచుండినను జైనులనేకులు సురక్షితులై యుందుచు వచ్చిరి కాని గణపతిదేవచక్రవర్తి కాలమున నతడు మొదట శైవమతాభిమానియు నద్త్విత వాదియునై యుండి జైనులయెడ బ్రబలద్వేషమును జూపుచుండెనని యనేక  గాధలవలన దెలియుచున్నది.  ఏకశిలానగరమ్న జైను లనెకులు నివసించు చుండగా సహింప్ జాలక శైవులను బ్రాహ్మణులను చక్రవర్తిని