పుట:Andhrula Charitramu Part 2.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సింహపురాధిపతి యైనతిక్కభూపాలునకును జరిగిన మహాఘోరయుద్ధములో పృధ్వీశ్వరరజు వీరమరణము నొందెను. అంతట పూర్వచాళుక్యుం డయిన బేతవిజయాదిలత్యునివంశమున జనించిన మల్లాదేవు డనునతడు విష్ణు వర్ధన నామముతో క్రీ.శ.1302వ సంవత్సరమున బీఠికాపురమున (పిఠాపురమున) పట్టాభిషిక్తుడై పదిసంవత్సరంజులకాలము పరిపాలనము చేసెను. ఇతనికి మల్లపదేవచక్రవర్తి యను బిరుదనామమౌ గలదు.

               తెలుగునాయకులు, లేక తెలంగాలు
    ఆకాలమున నిప్పటి కృష్ణామండలములోని యేలూరు, కొల్లేరుకోట లేక, ఆకువీడు, గణపవరము, ముఖ్యపట్టణములుగ నుండి తెలుంగునాయకులచే బరిపాలింపబడుచుండినటుల గనుపట్టుచున్నది. ఏలూరునకు కొలనుపుర మనియు, సారసిపుర మనియు, కమలాకరపుర మనియు బేరులున్నట్టు గా దెలుంగునాయకుల శాసనములం గనుపట్టుచున్నది.  వీరు చాళుక్యుల కాలము నను కాకతీయులకాలమునను సామంతమండలేశ్వరులుగ నుండి కమ్మ సేనానాయకులవలెనే ప్రసిద్ధిగాంచి యుండిరి. గణపవరమునకు పర్మినీపురమను నామమున్నట్లు గణపవరములోని సువర్నేశ్వరస్వామి వారిదేవాలయములోని యొకశాసనమువలన దెలియుచున్నది. ఇక్కడ నొకగొప్పకోటయుండెను. ఇయ్యది8 కొంతకాలము కోనసీమరాజు లయిన రాచవారివంశమునను, మఱి కొంతకాలము కొలనురేఅజు లయిన తెలంగాలవశమునను ఉండెను. ఈప్రాంత దేశ మంతయు గొలనుపురాధిపతు లయిన తెలుగునాయకులచేత పరిపాలింబ బడుచుండె ననుటకు లేశమాత్రమును సందియము లెదు. పైనజెప్పిన కోట లన్నియును తెలుగునాయకులచేతనే కట్టబడినవి. వీరికిని వేంగీ రాజప్రతినిధు లయిన వెలనాటి కమ్మవారికిని యుద్ధము లనేకములు జరిగినవి. తుదకు తెలుగునాయకులు వెలనాటిప్రభువులకు లోబడిన సామంత మండలాధిపతులు గనె యుండిచు వచ్చిరి. "భీమనాయకుడు, కాటమనాయకుడు" అను పేరులుగల తెలుగునాయకులనేకులు పండ్రెండవశతా