పుట:Andhrula Charitramu Part 2.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేవుడు రత్నపురము రాజధానిగ దక్షిణకోసలమును బరిపాలనము సేయుచు క్రీ.శ.1114 వ సంవత్సరమున నొకశాసనము వ్రాయించెను. అందతడు సోమేశ్వరునిం బట్టుకొని యసంఖ్యాశమైన శత్రుసైన్యము నురుమాడెనని గొప్పగా వ్రాయించుకొనియెను. సోమేశ్వరు డెవ్ఫడో వివరమును దెలుపలేదుగాని సంగతి సందర్భములను విచారింపగా నాసోమేశ్వరుడీచక్రకొట్యమండలాధిపు డయున యీసోమేశ్వరుడే యని తేటపడుచున్నది. మఱియును క్రీ.శ.1111 వ సంవత్సర మున వ్రాయబడిన నారాయణపుర శాసనములో సోమేశ్వరుని మరణానంతరమున కన్హారదేవుడు సింహాసన మెక్కెనని స్పష్టముగ దెలియుచున్నది.1 వరశూరపుర (Bursur) శాసనముంబట్టి క్రీ.శ.1102 దవ సంవత్సరమున సోమేశ్వరుడు జీచ్వించియుండెనని తెలిసికొనుచున్నారము 2. రత్నపురశాసనము క్రీ.శ.1114 వ సంవత్సరమున వ్రాయబడినది. ఈ సంవత్సములయొక్క సామీప్యసంబంధమును బట్టి మన మీవిషయమున నంతగా సందేహింపవలసిన పనిలేదు. సోమేశ్వరునిశాసనమునందు బేర్కొనం బడిన లంజికప్తాంతదేశము బాలఘట్టం మండలములోనిది. లవణపురప్రాంత దేశము రాయపురమండలములోని ప్రాగ్భాగమే కాని యన్యముకాదు. వజ్రపురము మిక్కిలి పురాతన మైనపట్టణ మనియు, ప్రాచీన ద్రావిడభాషా సారస్వతమునం బేర్కొనబడుచు వచ్చినదనియు, వాయిరాగద మనుపేరిట ద్రావిడశాసనముల వాడబడుచు నేనుగులకు బ్రసిద్ధి జెందినటుల జెప్పబడిన దనియు నిదివఱకే చెప్పియున్నాను. వజ్రపురము ప్రాచీనకాలమున నెట్టిప్రసిద్ధిని గాంచియుండినను 10.11 వ శతాబ్దములయందంత పేరువహించియుండలేదు. వజ్రపురము నజ్రపురములకు బ్రసిద్దికెక్కియున్నటుల జెప్పబడింది. వజ్రపుర మనునది చాందామండలములోని విఅరఘ్శర్ (Wairagarb) లేక భైర్వఘడా యనునదియేగాని యన్యముగాదని తొచుచున్నది. ఇయ్యది పురాతనకాలము నుండి వజ్రపుగనులకు బ్రసిద్దికెక్కినది. ఒకప్పుడు దంతావళములసను, బొమ్మ లద్దినబట్టలకును, దున్నలకును గూడ


1. Ind. Ant Vol.IX, P. 161 2 Ibid P. 162