పుట:Andhrula Charitramu Part 2.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలములయం దసాధారణ ప్రజ్ఞావంతులును లోకహితైక పరాయణులునగు మహాపురుషులుండిరనియు, నట్టి మహనీయుల వంశమునందు బుట్టిన తమ భాగ్యమనల్పమనియు, బ్రతియాంధ్రునకు దోచుటయెగాక యుత్తర రామచరిత్రలోని ఈ క్రింది పద్యముయొక్క భావమెంతమందుని డెందమునకయిన బోధ కలుగక మానదని చెప్ప సాహసించెదను.
శ్రీరాముడు :-
"చం. అలఘుత రార్క వంశకలశాబ్ధి శశాంకులు సర్వలోకపూ
జ్యులు నగు పార్థివుల్ తమ నిశబ్ధ చరత్రముచేత బండు వె
న్నెల గతి లోకమెల్లెడల నింపిన తోరపు కీర్తికియ్యెడన్
గలుష మొకింత నావలన గల్గినచో నిక నన్ను గాల్పనే"

రావుసాహెబ్ కృష్ణశాస్త్రి, బి.ఏ., గారి అభిప్రాయము

చెన్నపురి రాజధానిలో దొరతనమువారి శాసనపరిశోధకులుగానున్న రావుసాహెబ్ హెచ్.కృష్ణశాస్త్రి, బి.ఏ., గారు నాచే రచింపబడిన కృష్ణదేవరాయచరిత్రమును గూర్చి 1911వ సంవత్సరము జూను 20వ తేదీని నాకు వ్రాసిన జాబులో ఆంధ్రులచరిత్రమును గూర్చి వారి యభిప్రాయమీక్రింది వాక్యములలో దెలిపియున్నారు. “Already from your Andhracharitramu a copy of which was kindly made over to me for perusal by