పుట:Andhrula Charitramu Part-1.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునే ప్లీని మొదలగు విదేశీయులైన చరిత్రకారులు వక్కాణించి యున్నారు. కాబట్టి అశోకుని కాలంనాటి నాంధ్రులు నాగరికు లయియుండిరనుటకు సందియములేదు.

ఆంధ్రరాజులు మగధరాజ్యమును బాలించుచుండిన కాణ్వాంశజులను జయించి తద్రాజ్యము నాక్రమించుకొని నాలుగువందల యెనుబదియారు సంవత్సరములు నిరంకుశముగా బరిపాలనము చేసెనని పురాణములయుండియె పేర్కొనంబడి యుండుట చేత బాశ్చాత్యపండితులు ఆంధ్రులు గంగాతీరవాసులుగా బరిగణించి వాదోపవాదములను సలిపి గ్రంధసామాగ్రిని ఏర్పాటుచేసి క్రొత్తచిక్కులను గల్పించిరి. "ఆంధ్రులు ఆంధ్రజాతీయులు, ఆంధ్రభ్రుత్యులూ" అనివరుసగా వేర్వేరువంశనామములతో గంగాతీరమున --- నిరంతరముగా రాజ్యపాలనచేసి క్రమక్రమముగా తూర్పుతీరమంతయు నాక్రమించుకుని తుదకు కృష్ణాగోదావరుల నడుమ ధాన్యకటక దేశమును స్థాపించి పాలించిరనియు, వారుపోయిన విధముగాని కాలముగాని సరిగాదెలియరాదని విల్ఫర్డుగా రాంధ్రులనుగూర్చిన వ్యాసములో వ్రాయుచున్నారు.[1] దక్షిణహిందూస్థాన నాణెములచరిత్రము వ్రాసిన సర్ వాల్టరు ఎల్లియాట్ దొరగారు కూడా క్రీస్తుశకమునకు బూర్వము మూడవ శతాబ్ధమున గడపటిసారి వచ్చిన ద్రావిడులు మగధరాజ్యమునకు దూర్పున గంగానదీ ప్రాంతభూములు యందు గొంతకాలము నివసించి పెక్కు తెగలుగ నేర్పడిరనియు వారిలో[2]

  1. And likewise here, in the king's dominions, among the yonas and kambhojas, in (?) Nabhaka of the Nabhitis, among the Bhojas and Pitinkas, among the Andhras and Pulindas, everywhere men follow the law of Piety as proclaimed by his Majestry" (Rock Edict XIII)
  2. Pliny, Hist, Nat, book Vi, 21,22,23, From information probably supplied by Magesthenes. -Asiatic Researches Vol IX page 101.