పుట:Andhrula Charitramu Part-1.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆయుర్వేద మార్తాండభిషజ్మణి పండిత డి.గోపాలాచార్యులవారిచే ఆంధ్రీకరింపబడిన ఆయుర్వేదగ్రంథము.
మాధవనినాదము

అనేక వ్యాఖ్యాతల యభిప్రాయములతోడను, చరకశుశృత వాగ్భటాదుల మతములతోడను వ్రాయబడినది.

1- వైద్యుల సహాయములేకనే సులభముగ వ్యాధులను గుర్తించునటుల జేయుటయందు దీనినిమించిన గ్రంథమింకొకటి లేదు.

2. జ్వరము, అతిసారము, పాండు, నంజు,మొదలగు 100 ప్రధానవ్యాధులయొక్కయు, వాని అంతర్భాగములగు 1000 రోగములయొక్కయు పుట్టుటకు కారణములను, అ‌విరాబోవులక్షణములను, వాని నిజస్వరూపములను, విశేషముగ వ్యాపించురీతులను, వాని సంఖ్యాభేదములను, సాధ్యాసాధ్యాలక్షణములను, వ్యాధులు కుదరవనుటకు సూచించెడు ఉపద్రవములను, ఇట్టియనేక విషయముల నన్నింటిని ఈ గ్రంథము విపులముగ సూచించుచున్నది. ఈ గ్రంథము సంస్కృతమున గల పంజిక, మధుకోశ, అతంకదర్పణము, మొదలగు వ్యాఖ్యానములననుసరించియు భాషాంతరీకరింపబడినది. సామాన్యముగ వ్రాయబడిన ఆంధ్రటీకలవలెగాక అనేక విషయములతో నిమిడియున్నది. ఆంధ్రటీకలవలెగాక అనేకవిషయములతో నిమిడియున్నది. సంస్కృతమురానివారికిని, ఆంధ్రభాష సామాన్యముగ వచ్చినవారికిని, వైద్యసామాన్యులకునుమిక్కిలియుపయోగము.

3. ఉపోద్ఘాతమును బట్టి అయుర్వేదముయొక్క ప్రాముఖ్యత, సత్సంప్రదాయము చక్కగ విశదమగును. రాయల్ అక్టివో 50పౌనుల గ్లేసు కాగితములమీద సుందరముగ ముద్రింపబడి రమారమి 600పుటలు కలిగియున్నది.

వెల, పోష్టుఖర్చులుగాక, రు 3-0-0

వలయువారు గ్రంథకర్త చిరునామాకు వ్రాయవలయును.