పుట:Andhrula Charitramu Part-1.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవప్రకరణము

___

దండకారణ్య ప్రశంస.

మనపురాతన గ్రంథములలో శ్రీమద్రామాయణ మహాభారతములు మన పూర్వుల చరిత్రములను గొంతవఱకుఁ దెలుపుటకు సాధనములుగా నున్నవి. తన తండ్రియగు దశరథుడు కేకయ రాజపుత్త్రి కొసంగిన వరములదీర్చి తండ్రియాడినపలుకు దబ్బర గాకుండ నిలుపుటకై దేశములందును గ్రామములందును బ్రవేశింప నొల్లక పదునాలుగు సంవత్సరములు వట్టి యరణ్యమునందే నివసింప దీక్షవహించి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతముగా వచ్చి ఇప్పటి ఈ ఆంధ్రదేశ ప్రాంతములయందు నివసించినట్లును, అప్పుడీ ప్రాంతము ఘోరారణ్య ప్రదేశముగా నున్నట్లును శ్రీమద్రామాయణమునందుఁ దెల్పఁబడినది. అదియునుంగాక ఈ మహారణ్యప్రదేశముకు దిగువను కిష్కింధారాజ్య మున్నట్లుగూడఁ జెప్పఁబడినది. మరియును రావణుఁడు సీత నెత్తుకునిపోయినప్పుడామె మొఱ్ఱనాలకించి యాసాధ్వీమణిని రక్షింపవచ్చుటకుఁ గాని యామె యిచ్చెడు నానవాలును భద్రపఱచుటకుఁ గాని గోదావరి మొదలుకొని పంపానది వఱకు నామెకెవ్వరును గాన్పించి యుండలేదనియు గూడా దెల్పబడి యుండెను. పంపానది [1] కావలమాత్రము సుగ్రీవాదులు గాన్పించిరి. దీనింబట్టి రామాయణ కాలము నాటికి హిందూదేశము యుత్తరపు కొనయును దక్షిణపు కొనయును నాగరికులైన జనులచే నివసింపబడుచుండినదనియును, ఈ మహారణ్యమునం దనాగరికులయిన జాతులవా రచ్చటచ్చట నివాసము లేర్పరచు

  1. పంపానదియే తుంగభద్రానది. రామాయణమందు పంపా పంపాసరమని వర్ణింపఁబడినవి. బళ్ళారి జిల్లాలో హంపీ, హంపీసాగరమను పేరఁ హిందూదేశ కథాసంగ్రహము. ప్రథమభాగము 58వపొరట