పుట:Andhrula Charitramu Part-1.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హ్మణునకు దానముచేసి నట్లగ నీశాసనమునందు జెప్పబడినది. హిరణ్యగర్భుని (బ్రహ్మ) వంశమునం దుద్భవించినవాడని చెప్పబడినందున నీ యత్తివర్మ పల్లవుడని యూహింపబడుచున్నాడు. అత్తివర్మయొక్క తండ్రికందరు డానందగోత్రుడని చెప్పబడియుండుటచేత చెజ్జరాల శాసనములో నుదాహరింపబడిన కందరపడును, ఈ కందరుడు నొక్కడేయై యుండవలయును. అత్తివర్మశాసనము సంస్కృత భాషలో నున్నది. వీని రాజధాని యెచ్చటనుండెనో దెలియరాదుకాని యితడు గుంటూరు మండలమును బాలించినవాడని దెలియుచున్నది. వీరు నాలుగవ శతాబ్దములోని వారని చెప్పవచ్చును. ప్రస్తుత మింతకన్న వీరినిగూర్చి మనకు దెలియవచ్చినదేమియును లేదు. వేంగిపురమును బాలించినహస్తివర్మయె అత్తివర్మయని స్మిత్తుగా రభిప్రాయపడిరి గాని ఋజువుచేసియుండలేదు.

చండవర్మ.

చండవర్మ మహారాజు కళింగదేశమును బరిపాలించినవాడు.వీని శాసనమొకటి గంజాము మండలములోని నరసన్నపేటకు రెండుమైళ్లదూరమునుందున్న గోమర్తియను గ్రామమున దొరకినది.[1]

ఈ శాసనములోని లిపి వేంగిపురమును బాలించిన విజయనందవర్మ శాసనములోని లిపిని బోలియుండుటచేత నితడు నాలుగవశతాబ్దములోనివాడని శాసనపరిశోధకులు చెప్పుచున్నారు. ఈశాసనములోనిభాష దాదాపు పురసంస్కృతమైయున్నది. శాసనమతిక్రమించి వర్తించెడివారని శపించున్నట్టి శ్లోకములు మూడుమాత్రము తక్కతక్కినభాగమంత వచనముగ వ్రాయబడినది. కళింగాధిపతియైన చండవర్మ మహారాజు తనయాఱవ పరిపాలన వత్సరమున జైత్రశుద్ధ పంచమినాడు భారద్వాజ గోత్రుడును వాజననేయ శాఖాబ్రాహ్మణుడును నగు దేవశర్మకు కొహితూర(కొత్తూరు) గ్రామమును దానము చేసినట్లుగ జెప్పబడినది. ఈ శాసనము సింహపురమునుండి ప్రకటింపబడినది. విజయనందివర్మ శాసనములో వలెనె బప్పాభట్టా

  1. EP-Ind- Vol IV,pp. 142,143